
'శ్రేయాస్ ఈటి అప్' ద్వారా మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే క్లైమాక్స్, నాకెడ్ చిత్రాలు రిలీజ్ చేసిన ఈ 'శ్రేయాస్ ఈటి అప్' ఇప్పుడు 302 టైటిల్ తో సినిమా పూర్తి చేసుకుని చాలా కాలంగా రిలీజ్ లేక ఆగిపోయిన సినిమాని రిలీజ్ కు తెస్తోంది. ఈ సినిమా ఈ నెల 11 వ తేదీన రిలీజ్ కానుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా తమ గత సినిమాల్లాగే లాభాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ‘‘302’ ట్రైలర్ బావుంది.. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ–‘‘క్రైమ్, సస్పెన్స్, కామెడీతో పాటు హారర్ అంశాలతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహనిర్మాత: టి..వైకుంఠరావు.
ఇక 'శ్రేయాస్ ఈటి' అనేది ఎనీ టైమ్ థియేటర్ (ఏటీటీ). ఆన్‌లైన్ మల్టీప్లెక్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 10 నిమిషాల నుంచి రెండు గంటల నిడివి గల వివిధ జానర్ చిత్రాలను 'పే పర్ వ్యూ' మోడల్‌లో ప్రదర్శిస్తారు. థియేటర్‌లో సినిమా చూడటానికి టికెట్ కొన్నట్టు... మా 'శ్రేయాస్ ఈటి'లో సినిమా చూడటానికి టికెట్ కొనుక్కోవాలి. ఒక్కసారి టికెట్ కొంటే రెండు రోజుల పాటు ఎన్నిసార్లైనా సినిమా చూడవచ్చు.
ఈ మల్టీప్లెక్స్‌లో స్ర్కీన్స్ నిర్మాతలకు ఇస్తాం. ప్రతి గంటకు ఎంత రెవెన్యూ వచ్చినదీ వాళ్లే చూసుకోవచ్చు. కుటుంబంతో కలిసి చూసే చిత్రాలు శనివారం సాయంత్రం ఏడు గంటలకు, వర్మ 'క్లైమాక్స్' తరహా చిత్రాలు రాత్రి 9 గంటలకు విడుదల చేస్తాం. ఇందులో ఎన్ని రోజులు సినిమాను ప్రదర్శించాలనేది నిర్మాత ఇష్టం. తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్‌కి అమ్ముకోవచ్చు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం అని చెప్తున్నారు.