పంచతంత్రం మూవీలో వేదవ్యాస్ గా బ్రహ్మనందం!

Published : Sep 18, 2021, 12:03 PM IST
పంచతంత్రం మూవీలో వేదవ్యాస్ గా బ్రహ్మనందం!

సారాంశం

ప్రయోగాత్మక చిత్రంలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు బ్రహ్మనందం. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న పంచతంత్రం మూవీలో బ్రహ్మానందం వేదవ్యాస్ అనే కథకుడిగా కనిపించనున్నారు. 

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వందల సినిమాలలో కమెడియన్ గా నటించి మెప్పించిన ఆయన, ఈ మధ్య భిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం కథలో కీలకమైన ఓ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర హాస్యంతో కూడినది కాదని సమాచారం. 


తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు బ్రహ్మనందం. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న పంచతంత్రం మూవీలో బ్రహ్మానందం వేదవ్యాస్ అనే కథకుడిగా కనిపించనున్నారు. రెండు మూడు దశాబ్దాల క్రితం మన పల్లెటూరి దేవాలయాల్లో పురాణ కథలు వల్లించే కథకులు ఉండేవారు. రాత్రిపూట కథకుడు చెప్పే పురాణ కథలు వింటూ పల్లె ప్రజలు కాలక్షేపం చేసేవారు. 


పంచతంత్రం మూవీలో బ్రహ్మనందం అలాంటి కథకుడిగా కనిపించనున్నాడు. కోలీవుడ్ యాక్టర్ సముద్ర ఖని, శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి వంటి వారు పంచతంత్రం మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. నేడు పంచతంత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెట్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తుండగా, అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా