కమల్‌, శ్రీదేవి హిట్‌ టైటిల్‌తో నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ హీరో సినిమా

Published : Nov 06, 2020, 02:44 PM IST
కమల్‌, శ్రీదేవి హిట్‌ టైటిల్‌తో నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ హీరో సినిమా

సారాంశం

కోలీవుడ్‌లో సెటిల్‌ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్‌ హిట్‌ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్‌ హాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్‌ హిట్‌ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.

`జిగర్తాండ` చిత్రంతో ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డు గెలుచుకుని అందరి చూపు తనవైపు తిప్పుకున్న తమిళ నటుడు బాబీ సింహా మన తెలుగు వారు కావడం విశేషం. ఇక్కడే పుట్టిపెరిగి కోలీవుడ్‌లో సెటిల్‌ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్‌ హిట్‌ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్‌ హాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్‌ హిట్‌ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. నేడు(శుక్రవారం) బాబీ సింహా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు హీరో రానా. 

బాబీ సింహా హీరోగా నూతన దర్శకుడు రమణన్‌ పురుషోత్తమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, ముద్ర ఫిల్మ్స్  ఫ్యాక్టరీ పతాకాలపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ సరసన `నర్తనశాల` ఫేమ్‌ కాశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా టైటిల్ `వ‌సంత కోకిల`ని తెలుగులో రానా ప్రకటించగా, త‌మిళ నుంచి స్టార్ హీరో ధ‌నుష్, క‌న్న‌డ స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి విడుదల చేశారు. 

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని చిత్ర బృందం పేర్కొంది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ లో బాబీ సింహా విల‌క్ష‌ణ‌త ప్ర‌తిభింబించేలా ఉంది.  చేతిలో బౌ అండ్ యారో, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రిన్ క‌ల‌ర్ టింట్ ఇలా ఎన్నో ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ `వ‌సంత కోకిల` చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం చెబుతుంది. జాతీయ అవార్డ్ విన్నర్‌ క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `వ‌సంత కోకిల` ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాతో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే