
కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలిగా అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర టీమ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'బ్లడీ మేరీ' సినిమా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈమద్య కాలంలో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ను ఆహా లో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ ను ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేసి మరింత ఆసక్తిని సినిమాపై రేకెత్తేలా చేశారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అర్దమవుతోంది. ఒక విభిన్నమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఇంట్రస్ట్ కలుగుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
” ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని ఒక మనిషి ఉంటారు. అవసరం, అవకాశాన్ని బట్టి ఆ మనిషి బయటికి వస్తాడు.. మ్యాటర్ ఏంటి అంటే ఆ బయటికి వచ్చిన మనిషే ఒరిజినల్ అంటూ అజయ్ బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది.
ఇక కథను విషయానికొస్తే హాస్పిటల్ లో ఒక గ్యాంగ్ చిన్న పిల్లలను ఎత్తుకెళ్తారు. అక్కడ నివేతా ఆ ఘటనను చూసి వారిని రక్షించడానికి, ఆ క్రైమ్ ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.. మధ్యలో పోలీస్ ఆఫీసర్ అజయ్ ....ఇన్విస్టిగేషన్ లో అసలు ఎవరు క్రిమినల్స్ ని చంపుతోంది అనేది కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. చివరకు మేరీ తన ప్రియమైన వారిని రక్షించుకుందా..? అజయ్ నివేతా నిజ స్వరూపాన్ని బయటపెట్టడా..? నివేతా పక్కన ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? అనేది ట్విస్ట్ గా చూపించారు.
ఇక చివర్లో కాలానికి విపరీతమైన మెమరీ పవర్.. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు… కర్మ రూపం లో తిరిగి ఇచ్చేస్తుంది అని నివేతా చెప్పడం తో ఆమె తనకు జరిగిన అన్యాయాన్నీ ఎదిరించి న్యాయం దక్కించుకుందని తెలుస్తోంది. మరి అది ఎలా అనేది బ్లడీ మేరీ చేసు తెలుసుకోవాల్సిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి బ్లడీ మేరీ తో నివేతా హిట్ ని అందుకుంటుందా..? లేదా అనేది చూడాలి.
పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.