Bigg Boss Nonstop: డబుల్ ఎలిమినేషన్... అనుహ్యంగా హౌస్ నుండి ఇద్దరు అమ్మాయిలు అవుట్

Published : Apr 10, 2022, 08:41 PM ISTUpdated : Apr 10, 2022, 08:46 PM IST
Bigg Boss Nonstop: డబుల్ ఎలిమినేషన్... అనుహ్యంగా హౌస్ నుండి ఇద్దరు అమ్మాయిలు అవుట్

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఇద్దరూ అమ్మాయిలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

బిగ్ బాస్ నాన్ స్టాప్(Bigg Boss Nonstop) సగానికి చేరుకుంది. నేడు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున (Nagarjuna)వేదిక పైకి వచ్చారు. హౌస్ మేట్స్ వారం రోజుల ప్రవర్తనపై రివ్యూ నిర్వహించడంతో పాటు వాళ్లతో గేమ్స్ ఆడారు. ఓ ప్రక్క ఎంటర్టైన్ చేస్తూనే ఎలిమినేషన్ టెన్షన్ కొనసాగించారు. కాగా ఈ వారం అనూహ్యంగా నాగార్జున ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ ని హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు. 

ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్ లో చివరికి ముగ్గురు మిగిలారు. మొమైత్(Mumaith Khan), స్రవంతి, మిత్ర లను నాగార్జున వాళ్ళ ఎదురుగా ఉన్న బాక్సుల్లో చేతులు ఉంచాలని ఆదేశించారు. ముగ్గురు చేతులు పెట్టిన అనంతరం తన కౌంట్ ఆధారంగా బయటికి తీయాలన్నారు. ఎరుపు రంగు ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్, గ్రీన్ కలర్ ఉన్న కంటెస్టెంట్స్ సేవ్ అవుతారని చెప్పారని. ముమైత్, స్రవంతి చేతులకు రెడ్ కలర్ అంటి ఉండగా... మిత్ర చేతికి మాత్రమే గ్రీన్ కలర్ ఉంది. దీంతో ముమైత్, స్రవంతి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. 

మొదటివారం హౌస్ నుండి ఎలిమినేటైన ముమైత్ కి మరొక ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి కూడా ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండలేకపోయారు. రెండోసారి ఎలిమినేషన్ ని మొమైత్ సీరియస్ తీసుకోలేదు. స్రవంతి (Sravanthi)మాత్రం చాలా అప్సెట్ అయ్యారు. ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక హౌస్ లో నటరాజ్ మాస్టర్ పై ఆమె నెగిటివ్ కామెంట్స్ చేశారు. అఖిల్, అజయ్, బిందు, అషురెడ్డి తనకు అత్యంత ఇష్టమైన కంటెస్టెంట్స్ ని తెలియజేశారు. 

ఇప్పటికే సరయు, ఆర్జే చైతు, తేజస్వి మడివాడ, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో అఖిల్, అరియనా, అషురెడ్డి, బిందు మాధవి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పాటు శివ, మిత్ర, అనిల్, అజయ్ ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ నాన్ స్టాప్ అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేకుంది. ఈ ఫార్మాట్ జనాలకు అంతగా నచ్చలేదు. కంటెస్టెంట్స్ తో పాటు గేమ్ ఏమంత ఆసక్తికరంగా సాగడం లేదు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?