`రాపో19` సెట్‌లో భారతీరాజా సందడి.. రామ్‌, కృతిశెట్టి సమక్షంలో బర్త్ డే సెలబ్రేషన్‌

Published : Jul 17, 2021, 07:02 PM IST
`రాపో19` సెట్‌లో భారతీరాజా సందడి.. రామ్‌, కృతిశెట్టి సమక్షంలో బర్త్ డే సెలబ్రేషన్‌

సారాంశం

రామ్‌ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న `రాపో19`(వర్కింగ్‌ టైటిల్‌) సెట్‌లో లెజెండరీ దర్శకుడు భారతీరాజా సందడి చేశారు. యూనిట్‌ సమక్షంలో ఆయన బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు.

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని తన కొత్త సినిమా సెట్‌లో ప్రతి రోజు సందడి నెలకొంటుంది. వరుసగా సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. మొన్న స్టార్‌ డైరెక్టర్‌ శంకర్  `రాపో19` యూనిట్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. కాసేపు రషెస్‌ చూసి, రామ్‌, దర్శకుడు లింగుస్వామితో ముచ్చటించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా మరో దర్శకుడు సందడి చేశారు. నటుడు, దర్శకుడు భారతీరాజా సెట్‌లో మెరిసారు. 

శనివారం ఆయన రామ్‌ సినిమా సెట్‌కి వచ్చి కాసేపు సరదాగా గడిపారు. షూటింగ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే నేడు(శనివారం) దర్శకుడు భారతీరాజా పుట్టిన రోజు. దీంతో సెట్‌లోనే రామ్‌, లింగుస్వామి, హీరోయిన్‌ కృతి శెట్టిల సమక్షంలో భారతీరాజా బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు. ఆయన చేత కేక్‌ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇక రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా, దీన్ని తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. నదియా కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?