బాలీవుడ్ భామల మెడకు పీఎన్బీ స్కామ్.. కోట్లల్లో మునిగారు

Published : Feb 22, 2018, 04:31 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బాలీవుడ్ భామల మెడకు పీఎన్బీ స్కామ్.. కోట్లల్లో మునిగారు

సారాంశం

పీఎన్బీ కేసులో నిండా మునిగిన బాలీవుడ్ భామలు ఇప్పటికే నీరవ్ మోదీతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న ప్రియాంక తాజాగా పీఎన్బీ కేసుతో గీతాంజలి జెమ్స్ లింకు బట్టబయలు దీంతో బ్రాండ్ ఎంబాజిడర్లుగా వున్న కంగనా, బిపాసాలకు పేమెంట్ గల్లంతు

తాజాగా పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కాంట్రాక్ట్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రద్దు చేసుకున్న నేపథ్యంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ పేరు కూడా రావడంతో ఆయన నేతృత్వంలోని ''గీతాంజలి'' జెమ్స్‌కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు బిపాసా బసు, కంగనా రనౌత్‌లు మండిపడుతున్నారు.
 

ఇద్ద‌రు హిరోయిన్ల‌కు కోపం రావ‌డానికి గ‌ల కారణం కంపెనీ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారికి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడమే. గీతాంజలి బ్రాండ్‌లు నక్షత్ర, గిలికి ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు బిపాసా, కంగనా రనౌత్‌లో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.
 

నక్షత్ర బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. కానీ ఒప్పందం ప్రకారం ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని కంపెనీ ఇవ్వలేదని ఆమె నటించిన క్వీన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లాంటి చిత్రాలకు ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి చెప్పారు. నక్షత్ర బ్రాండ్ కోసం 2016లో కంగనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?