Kapil Sharma, Kapil, Kapil Punj Sharma, కపిల్ శర్మ, కమెడియన్ కపిల్ శర్మ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 15, 2022, 03:53 PM IST
Kapil Sharma, Kapil, Kapil Punj Sharma, కపిల్ శర్మ, కమెడియన్ కపిల్ శర్మ

సారాంశం

బుల్లితెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కామెడీ నైట్ విత్ కపిల్ శర్మ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా తన జీవితంపై బయోపిక్ తీయనున్నారు. 

తన మాటలతో ఇట్టే  ఆకట్టుకునే కపిల్ పంజ్ శర్మ  ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కేరీర్ ను బిల్డప్ చేసుకున్నారు. స్టాండప్ కమెడియన్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా, టీవీ యాక్టర్ గా మనకు కపిల్ శర్మ  ఎంతో సుపరిచితం. తన ప్రతి షోను ప్రేక్షకులు,  ఆయన అభిమానులు ఎంతో ఇష్టపడుతారు. వ్యూవర్స్ అభిమతం మేరకే కపిల్ శర్శ తన షోను ఆసక్తి భరితంగా నడిపిస్తుంటాడు. 
స్టాండప్ కమెడియన్ గా  తన కేరీర్ ను ప్రారంభించిన కపిల్  శర్మ  తన పేరు మీద ఏకం ఒక షోనే రన్ చేసే స్థాయికి  ఎదగడం గొప్ప విషయం. 2007 ప్రారంభమైన ‘కామెడీ సర్కర్స్’, 2015లోని ‘కిస్ కిస్ కో ప్యార్ కర్నా’, అదేవిధంగా 2013  మధ్యలో 2016  కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోకు, ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. 2007లో ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్  టెలివిజన్ షోలో పాల్గొని అవార్డు పొందారు.  ఆ అవార్డు తోనే కపిల్ శర్మకు ఫేమ్ వచ్చింది. 
కపిల్ సందర్భోచితం అద్భుతం ఉంటుంది. తను వేసే పంచులు, ఒక సందర్భాన్ని తను వివరించే తీరు చాలా హాస్యాస్పదకంగా ఉంటాయి. అందుకే  కపిల్ శర్మ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కపిల్ లక్షలాది మంది అభిమానులను  సొంతం చేసుకున్నాడు. కపిల్ శర్మ చేసే సెటైర్లకు సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.  
ఎంతటి సైలెన్స్ నైనా బద్ధలు కొట్టాలంటే కపిల్  వాయిస్ వినిపించాల్సిందే. ప్రతి షోలు నవ్వుల వర్షం పూయించడంలో కపిల్ తన వంతుగా ప్రయత్నం చేస్తాడు. అందుకే ప్రేక్షకులు ఏ షో మిస్సైన కపిల్  షో మాత్రం మిస్ అవ్వరు అనేది అతిశయోక్తి కాదు. కపిల్ కు సోషల్ మిడియాలోనూ ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లోనైతే ఏకంగా 33 మిలియన్స్ సబ్ స్రైబర్స్ ఉన్నారు. 

 

ఈ నేపథ్యంలో కపిల్ శర్మపై బయోపిక్ తీయనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్‌ ద్వారా తెలిపాడు.  అయితే ఇప్పటివరకూ కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్‌ తీయలేదు. కపిల్ శర్మపై బయోపిక్ రానుండటంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ బయోపిక్‌ చిత్రానికి 'ఫంకార్‌' అని టైటిల్‌ పెట్టారు. దీనికి మహావీర్‌ జైన్‌ నిర్మాతగా కాగా,  మృగ్ధీప్‌ సింగ్‌ లంబ దర్శకత్వం వహించనున్నారు.  సింగ్ గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్‌ చేశారు.  ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్‌ శర్మ కోట్లాది మంది ప్రజలకు రోజూ నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్‌ జైన్‌ పేర్కొన్నారు.  
 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్