బాక్సింగ్‌ రింగ్‌లో తమన్నా ఐటెమ్‌ సాంగ్‌ మోత.. కేకపెట్టిస్తుందిగా

Published : Jan 15, 2022, 02:23 PM IST
బాక్సింగ్‌  రింగ్‌లో తమన్నా ఐటెమ్‌ సాంగ్‌ మోత.. కేకపెట్టిస్తుందిగా

సారాంశం

వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న `గని` చిత్రంలో తమన్నా  స్పెషల్‌ సాంగ్‌ చేసింది. `కొడితే.. `అంటూ  సాగే  ఈ పాటని సంక్రాంతి కానుకగా శనివారం విడుదల చేశారు. 

ఓ వైపు స్టార్‌ హీరోయిన్‌గా  రాణిస్తూనే ఐటెమ్‌ సాంగ్స్ లో, స్పెషల్‌  సాంగ్‌లో మెరవడం గత కొంత  కాలంగా ట్రెండ్‌గా  మారిపోయింది. గతంలో ఐటెమ్‌ సాంగ్‌లకు,  స్పెషల్‌ నంబర్లకి ఇతర నటీమణులను తీసుకునే వారు.  కానీ కొంత కాలంగా హీరోయిన్లే ఇలాంటి సాంగ్స్  చేస్తుండటంతో సినిమాల్లో అవి హైలైట్‌గా  మారుతున్నాయి. క్రేజ్‌ని తీసుకొస్తున్నాయి. తమన్నా(Tamannah)  చాలా  కాలంగానే ఐటెమ్ సాంగ్స్ చేస్తుంది. తాజాగా ఆమె మరో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. 

వరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరోగా రూపొందుతున్న `గని`(Ghani) చిత్రంలో తమన్నా  స్పెషల్‌(Tamannah Special Song) సాంగ్‌ చేసింది. `కొడితే.. `అంటూ  సాగే  ఈ పాటని సంక్రాంతి కానుకగా శనివారం విడుదల చేశారు. ఇందులో తమన్నా తనదైన  మాస్‌ స్టెప్పులతో రెచ్చిపోయింది. బాక్సింగ్‌ రింగ్‌లో ఆమె వేసే  హాట్‌ డాన్సుకి కుర్రాళ్ల మతిపోతుందని  చెప్పొచ్చు.  తన హాట్‌ అందాలను ఆరబోస్తూ పొట్టి కాస్ట్యూమ్స్ ధరించి కిర్రాక్‌ స్టెప్పులతో కేక పెట్టిస్తుంది తమన్నా. ఆడియెన్స్ కిది మంచి  విజువల్‌ ట్రీట్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. 

వరుణ్‌ తేజ్‌ హీరోగా, సాయీ మంజ్రేకర్‌ కథానాయికగా, కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `గని`.  అల్లు అర్జున్‌ అన్నయ్య అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  తాజాగా విడుదలైన `కొడితే` పాటని హరిక నారాయణ్‌ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రాశారు. ప్రస్తుతం పాట  యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్‌ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా దూపొందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక తమన్నా ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేసి మెప్పించింది. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆమె `భోళాశంకర్‌`లో చిరంజీవితో, `ఎఫ్‌3`లో వెంకటేష్‌తో, `గుర్తుందా  శీతాకాలం`లో సత్యదేవ్‌తో కలిసి నటిస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

KS Chithra: కూతురు మరణంతో సింగర్ చిత్ర షాకింగ్ నిర్ణయం, ఇళయరాజా, లతా మంగేష్కర్ ఏం చేశారంటే?
Varun Tej Surgery: మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తా, మోకాలి సర్జరీ పై వరుణ్ తేజ్ ఏమన్నాడంటే?