'సై రా' బిజినెస్.. డిటిటల్ రైట్స్‌కు భారీ ధర!

By AN TeluguFirst Published Sep 10, 2019, 3:50 PM IST
Highlights

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ 
బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెత్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల వరకు సైరా బిజినెస్ జ‌రిగినట్లు సమాచారం.  నైజాంలో అత్యధికంగా సైరా రూ.30కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో మెగాస్టార్ స్టామినాతో రూ.22 కోట్లకు, ఉత్త‌రాంధ్రలో రూ.14.4 కోట్లకు సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తోంది.

ఇక తూర్పు గోదావరి - కృష్ణ ఏరియాల్లో మొత్తంగా 17కోట్లకు అమ్ముడైన సైరా గుంటూరులో రూ.11.5కోట్లు, నెల్లూరులో రూ.4.8కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. తాజాగా సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.40 కోట్ల రికార్డ్ ధరకు ఈ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఇండియా సొంతం  చేసుకుందని అంటున్నారు. అన్ని భాషలకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

click me!