సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ లిస్ట్ లీక్‌.. ఒక్కరు తప్ప అంతా కొత్తోళ్లే..

Published : Sep 13, 2021, 06:36 PM IST
సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ లిస్ట్ లీక్‌.. ఒక్కరు తప్ప అంతా కొత్తోళ్లే..

సారాంశం

రెండో వారంలో ఎలిమినేషన్‌కి నామినేటైన సభ్యుల లిస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండో వారం ఏడుగురు నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఆర్జే కాజల్‌ మరోసారి నామినేట్‌ అయ్యింది. వీరితోపాటు...

బిగ్‌బాస్‌5 షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. మొదటి వారం ఎలిమినేట్‌ అయిన సరయు పోతూ పోతూ ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. దీంతో ఇంటి సభ్యుల్లో చలనం కలుగుతుంది. ఫస్ట్ వీక్‌ సైలెంట్ ఉన్నవాళ్లంతా ఇప్పుడు రెచ్చిపోతున్నారు. తమలోని అసలు గేమర్‌ ని బయటకు తీస్తున్నారు. తాజాగా స్వేత వర్మ రెచ్చిపోయింది. హౌజ్‌ని ఓ ఆట ఆడుకుంది. 

తాజాగా విడుదలైన ప్రోమోలో స్వేత వర్మ, లోబో రెచ్చిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హౌజ్‌ మేట్స్ రెండు జట్లుగా విడిపోయి, ఇతర జట్టు వారిని ఎలిమినేషన్‌కి నామినేషన్‌ చేయాలని బిగ్‌బాస్‌ తెలిపారు. ఆ మేరకు ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోయారు. యాంకర్‌ రవిపై లోబో చేసిన కామెంట్లు, అలాగే హమీద, లోబోలపై స్వేత వర్మ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. వీరిద్దరు ఫేక్‌ అంటూ రెచ్చిపోయారు. 

ఇదిలా ఉంటే రెండో వారంలో ఎలిమినేషన్‌కి నామినేటైన సభ్యుల లిస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండో వారం ఏడుగురు నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఆర్జే కాజల్‌ మరోసారి నామినేట్‌ అయ్యింది. వీరితోపాటు నటరాజ్‌మాస్టర్‌, ఆనీ మాస్టర్‌, లోబో, ప్రియా, ఉమాదేవి, ప్రియాంక సింగ్‌ నామినేట్‌ అయ్యారు. వీరింతా కొత్తవారే కావడం విశేషం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ అంతా కొత్తవాళ్లు నామినేషన్‌లోకి రావడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..