సాయి తేజ్ యాక్సిడెంట్ : అరబిందో కంపెనీకి ఫైన్ !

By Surya PrakashFirst Published Sep 13, 2021, 4:55 PM IST
Highlights

శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి.

కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ  ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసారు.   ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్‌ పరిస్థితి నిలకడగా ఉందని.. శ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని తాజా హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు అపోలో డాక్టర్లు.

 మరోవైపు.. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులు. రోడ్ల మీద భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తున్న వారిపై చర్యలకు పూనుకుంటున్నారు.  మాదాపూర్ ఖానామెట్‌లో నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి లక్ష రూపాయల జరిమాన విధించారు జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు.  అరబిందో కన్స్రక్షన్ కంపెనీ కారణంగా వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని,,, అవి రోడ్లపైనే ఎక్కువగా కనిపిస్తోన్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధియారులు చెబుతున్నారు.

కాగా, సాయి ధరమ్ తేజ్‌ వెళ్తున్న బైక్‌.. రోడ్డుపై ఉన్న ఇసుకలో స్కిడ్‌ కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన మరునాడు.. ఘటనా స్థలంలో రోడ్డుపై మట్టి కనిపించడగా.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ దానిని క్లీన్‌ చేసిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీపై విమర్శలు వచ్చాయి. 

ఇక సాయి తేజ పై నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

 నిన్న (ఆదివారం) సాయి తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్‌ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంది’’ అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.  

click me!