
బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ సారి టాప్ కంటెస్టెంట్లతో సాగుతుంది. దాదాపు ఇరవై మంది కంటెస్టెంట్లని హౌజ్‌లోకి దించబోతున్నారు బిగ్‌బాస్. అందులో భాగంగా ఇప్పటి వరకు 17 మంది రాగా, 18వ కంటెస్టెంట్‌గా స్వేత వర్మ వచ్చారు. సోషల్ మీడియాలో, నటిగా పాపులర్ అయిన ఈ భామ నాగార్జున ముందు రచ్చ చేసింది. ఎంట్రీతోనే అదిరిపోయే సాంగ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టింది స్వేత వర్మ.
ఆ తర్వాత నాగార్జున ముందు కూడా అదే హుషారు చూపించింది. తాను ఏదైనా స్ట్రెయిట్ అని, తగ్గెదేలే అని, ఎవరైనా ఎక్‌ట్రాలు చేస్తు ఇచ్చిపడేస్తా అని తెలిపింది. `దేత్తడి పోచమ్మ గుడి` అని పేర్కొంది. గత సీజన్‌లో `దేత్తడి` హారిక మాదిరిగా ఈ సారి స్వేతని దించినట్టు తెలుస్తుంది. తాను అన్ ప్రెడిక్టబుల్ అంటూ చెప్పింది. హౌజ్‌లోనూ రచ్చ చేస్తానని బోల్డ్ గా చెప్పేసింది స్వేత వర్మ.
మరోవైపు 19వ కంటెస్టెంట్‌గా పాపులర్ యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డాన్స్ తో దుమ్ములేపిన రవిని నాగార్జున ఆట పట్టించాడు. నీకు పెళ్లైన విషయం నాకు చెప్పలేదని ఆటపట్టించాడు. దీనికి యాంకర్ రవి చెబుతూ మూడేళ్ల క్రితమే చెప్పానని తెలిపాడు.
ఈ సందర్భంగా తన కూతురు ఇచ్చిన గిఫ్ట్ కి, ఆమె చివరి మాటలకు ఎమోషనల్ అయ్యాడు రవి. ఇది అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు తాను హౌజ్‌లో రియల్ రవిగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. బయట అలా ఉండలేకపోయానని, ఇప్పుడు చూపిస్తానని తెలిపారు.