నటుడు మానస్... ఆర్జే కాజల్ ఎంట్రీతో హౌస్ మరింత ఇంట్రెస్టింగ్ గా...!

By team teluguFirst Published Sep 5, 2021, 10:03 PM IST
Highlights

16వ కంటెస్టెంట్ గా నటుడు మానస్, 17వ కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చారు. మానస్ కాస్ట్యూమ్, డాన్స్ ని నాగ్ అప్రిసియేట్ చేశారు. 

ఈసారి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ తో పోటెత్తేలా కనిపిస్తుంది. ఇప్పటికే 15మంది హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇంకా 16వ కంటెస్టెంట్ గా నటుడు మానస్, 17వ కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చారు. మానస్ కాస్ట్యూమ్, డాన్స్ ని నాగ్ అప్రిసియేట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా చేశావ్, అలాగే నీవు మమ్మీ బాయ్ అని తెలిసింది. హౌస్లో ఉండగలవా అని అడిగారు. ఛాలెంజెస్ అంటే ఇష్టం అన్న మానస్, హౌస్ లో ఉంటానని నాగ్ కి హామీ ఇచ్చారు. 


అలాగే మానస్ తన అమ్మగారికి హాయ్ చెప్పాలని నాగార్జునను కోరారు, నాగార్జున మానస్ తల్లిగారైనా పద్మినికి హాయ్ తెలిపారు. హౌస్ లో నీవు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉంటావా, హీరోనా, విలనా అని అడుగుగా, ఎప్పుడూ హీరోగా ఉండాలనేది కోరిక అని, అలాగే అక్కడ కూడా ఉంటానని అన్నారు. 


మానస్ అనంతరం ఆర్జే కాజల్ 17వ కంటెస్టెంట్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. కాజల్ కి మైక్ ఇవ్వడానికి నాగార్జున భయపడ్డారు. కాజల్ ఆర్జే కావడంతో ఆమెకు మైక్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటుంది, అన్న అర్థంలో సెటైర్ వేశారు. కాజల్ తనకు నాగార్జున ఐ లవ్ యు చెప్పాలని కోరుకోగా, నాగ్ ఆ కోరిక నెరవేర్చాడు. హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని కాజల్, నాగార్జునతో చెప్పి హౌస్లోకి ఎంటర్ కావడం జరిగింది. 
 

click me!