ఎనిమిదో వారం నామినేషన్‌ ఆరుగురు ఫిక్స్.. గొడవపడ్డా అఖిల్‌, అమ్మా రాజశేఖర్‌

Published : Oct 26, 2020, 11:15 PM ISTUpdated : Oct 26, 2020, 11:25 PM IST
ఎనిమిదో వారం నామినేషన్‌ ఆరుగురు ఫిక్స్.. గొడవపడ్డా అఖిల్‌, అమ్మా రాజశేఖర్‌

సారాంశం

బిగ్‌బాస్‌ 4, ఎనిమిదో వారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్‌గా ఈ వారం ఆరుగురు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. వారిలో అమ్మా రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్‌, లాస్య, అఖిల్‌, మోనాల్‌ ఉన్నారు. 

బిగ్‌బాస్‌ 4, ఎనిమిదో వారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్‌గా ఈ వారం ఆరుగురు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. వారిలో అమ్మా రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్‌, లాస్య, అఖిల్‌, మోనాల్‌ ఉన్నారు. 

ఈ నామినేషన్‌ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫైర్‌ అవ్వడం వంటి సంఘటనలతో సాగింది. ముఖ్యంగా అఖిల్‌, అమ్మా రాజశేఖర్‌ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విరుకుపడ్డారు. సింపతి విషయంలో అమ్మాని అఖిల్‌ నామినేషన్‌ చేయగా, అదే విషయంలో అఖిల్‌ని నామినేట్‌ చేశాడు అమ్మా. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. 

పొగిడితే మంచి వారు, లేకపోతే చెడ్డవారిగా భావిస్తారని అమ్మాపై అఖిల్‌ విమర్శించారు. అఖిల్‌, అభిజిత్‌, మోనాల్‌ విషయంలో ముగ్గురికి గొడవ అయ్యింది. ఇష్యూ అయ్యింది. కానీ అది వదిలేసి అఖిల్‌.. అభిజిత్‌ తో క్లోజ్‌ అయ్యారు. ఈ విషయంలో తనకు నచ్చేలదన్నారు అమ్మా. దీనికి అఖిల్‌ స్పందిస్తూ, ఆ విషయాలపై, అమ్మా తనపై చేసిన విషయాలపై నేను చాలా ఫీల్‌ అయ్యానని, తమ అమ్మా నాన్న కూడా ఫీల్‌ అయ్యి ఉంటారని అన్నారు. దీనికి అమ్మా కూడా ఘాటుగానే స్పందించారు. మొత్తంగా ఇద్దరి మధ్య వివాదం హౌజ్‌ని హీటెక్కించింది. మొత్తానికి అత్యధిక ఓట్లతో అమ్మా రాజశేఖర్‌ నామినేట్‌ అయ్యారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌