ఏది జరగకూడదో అదే జరిగితే..సింప్లిసిటీ కష్టం.. పూరీ మ్యూజింగ్స్

By Aithagoni RajuFirst Published Oct 26, 2020, 8:04 PM IST
Highlights

జీవితంలో ఏదైతే జరగకూడదో.. అదే జరిగితే అదే జీవితం అంటున్నారు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. లాక్‌డౌన్ టైమ్‌లో పూరీ జగన్నాథ్‌ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే.

జీవితంలో ఏదైతే జరగకూడదో.. అదే జరిగితే అదే జీవితం అంటున్నారు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. లాక్‌డౌన్ టైమ్‌లో పూరీ జగన్నాథ్‌ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. సమాజంలోని అనేక అంశాలపై తన కోణాన్ని, పలు వాస్తవాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా ఆయన జీవితం గురించి, దాని `సింప్లిసిటీ` గురించి చెప్పారు. అన్నిటి కంటే కష్టమైంది సింపుల్‌గా బతకడమే అని తెలిపారు. సాధారణ జీవితం గడపడం అంత ఈజీ కాదని, కచ్చితంగా ఇదే కావాలని కూర్చుంటే కుదరదని, దేనికైనా ఓర్పు, సర్దుకుపోవడం నేర్చుకోవాలన్నారు. మనం జీవితం పర్‌ఫెక్ట్ కాదన్నారు. అంతేకాదు మనం కూడా పర్‌ఫెక్ట్ కాదట. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడమే జీవితం అని తనదైన స్టయిల్‌లో చెప్పాడు. 

ఇంకా పూరీ `సింప్లిసిటీ` గురించి తన ఆలోచనలు పంచుకుంటూ, `మనం ఏదైనా కావాలని దేవుడిని కోరుకుంటే.. మన వద్ద ఉన్న ఆవుని పోగొట్టి, అది మళ్ళీ దొరికేలా చేస్తాడని ఉదాహరణగా చెప్పాడు. ఈ మధ్యలో జరిగేదే జీవితం, ఏది జరగకూడదో అది జరగడమే జీవితం అని, సింప్లిసిటీ అంటే వర్తమానాన్ని స్వీకరించడం, పేదరికంలో బతకడం కాదు, వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా సింపుల్‌గానే జీవిస్తుంటారన్నారు. 

ప్రపంచంలోని టాప్‌ సీఈవోలు 2500 చదరపు అడుగుల అపార్ట్ మెంట్లోనే ఉంటున్నారు. మనం వీళ్ళ కంటే ఎక్కువ పనిచేయడం లేదు కదా! మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియాలి. అవసరం లేనివి పక్కనపెడితే అదే సింప్లిసిటీ.. ఇలా ఉండటం చాలా కష్టంమని, అయినా సింపుల్‌గానే ఉండాలని తెలిపారు. ప్రస్తుతం పూరీ.. విజయ్‌ దేవరకొండ హీరోగా `ఫైటర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌. 
 

click me!