షాకింగ్ రూమర్.. మహేష్, రాజమౌళి మధ్య ఒప్పందం ?

By telugu teamFirst Published Sep 3, 2021, 5:14 PM IST
Highlights

ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఏ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో టాలీవుడ్ లో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు వీలుంటే థియేటర్లలోకి లేకుంటే ఓటిటిలోకి దూరేస్తున్నాయి.

ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఏ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో టాలీవుడ్ లో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు వీలుంటే థియేటర్లలోకి లేకుంటే ఓటిటిలోకి దూరేస్తున్నాయి. బడా చిత్రాలని షూటింగ్ పూర్తి చేసుకుని సరైన టైం కోసం ఎదురుచూస్తున్నాయి. 

ఈ పరిస్థితుల్లో నిర్మాతలు, థియేటర్ బిజినెస్ నే నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం పెద్ద అడ్డంకిగా మారింది. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే టైంలో మరో సినిమా రిలీజ్ కాలేని పరిస్థితి. 

ముందుగా అక్టోబర్ 13న అనుకున్నారు కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. సంక్రాంతికి లేదా వచ్చే ఏడాది సమ్మర్ కి అంటూ పీలర్లు మాత్రం వదులుతున్నారు. దీనితో రాజమౌళి వ్యవహారం అర్థంకాక చాలా చిత్రాలు దసరా స్లాట్ కోసం ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలయ్య అఖండ చిత్రాలు రెడీగా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో రాజమౌళి సంక్రాంతికే ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ లాంటి చిత్రాలతో టైట్ గా మారింది. 

దీనితో రాజమౌళి.. మహేష్ బాబుని రిక్వస్ట్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. సర్కార్ వారి పాట చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఆ తేదీన ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే. ఆ చనువుతోనే రాజమౌళి మహేష్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబు కూడా అంగీకారం తెలిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఆర్ఆర్ఆర్ చిత్రం సంక్రాంతికి పక్కాగా వస్తే తన చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తానని మహేష్ రాజమౌళి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది జరిగితే మాత్రం మహేష్ అభిమానులకు నిరాశే. 

click me!