నటరాజ్‌ మాస్టర్‌కి బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ః భార్య సీమంతం చూసి కన్నీళ్లు.. బేబీ అల్లరికి ఫిదా

Published : Sep 24, 2021, 11:30 PM IST
నటరాజ్‌ మాస్టర్‌కి బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ః భార్య సీమంతం చూసి కన్నీళ్లు.. బేబీ అల్లరికి ఫిదా

సారాంశం

నటరాజ్‌ మాస్టర్కి(nataraj master) సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌(biggboss5). తన భార్య సీమంతం(seemantham) వీడియోని చూపించారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రధానంగా నటరాజ్‌ మాస్టర్‌ భార్య సీమంత వీడియో హైలైట్‌గా నిలిచింది. ముందుగా చిన్న పాప ఏడుస్తున్నట్టుగా ఓ ఆడియోని వినిపించి అందరికి షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ చేశారు. 

బిగ్‌బాస్‌5 షో శుక్రవారం ఎపిసోడ్‌ లైటర్‌ వేలో సాగింది. ఇంటి సభ్యుల గుసగుసలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అదే సమయంలో వరస్ట్ పర్‌ఫెర్మెర్‌ని, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లను ఇచ్చారు. అయితే ఇందులో నటరాజ్‌ మాస్టర్కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తన భార్య సీమంత వీడియోని చూపించారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రధానంగా నటరాజ్‌ మాస్టర్‌ భార్య సీమంతం వీడియో హైలైట్‌గా నిలిచింది. ముందుగా చిన్న పాప ఏడుస్తున్నట్టుగా ఓ ఆడియోని వినిపించి అందరికి షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ చేశారు. 

చిన్న పాప డాల్‌ని పంపించి, ఆ పాపని ఇంటిసభ్యులు కలిసి ఎంటర్‌టైన్‌ చేయాలని తెలిపారు. నటరాజ్‌ మాస్టర్‌ ఆ పాపని తీసుకుని లాలించాడు. నవ్వించాడు. ఇలా చేసిన కొద్ది సేపటికే నటరాజ్‌ మాస్టర్‌కి తన భార్య సీమంతం వీడియోని చూపించారు. ఇటీవల ఆమె సీమంతం జరగగా శుక్రవారం ఎపిసోడ్‌లో దాన్ని ఇంటి సభ్యుల సమక్షంలో నటరాజ్‌ మాస్టర్‌ తిలకించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ, ఇంట్లో ఉన్నప్పుడు నైట్‌ మాట్లాడినప్పుడు బేబీ కదిలేదని, ఇప్పుడు బిగ్‌బాస్‌లో తన మాటలు విని, కడుపులో ఉన్న బేబీ తనతో డిష్యూం, డిష్యూం అని ఫైట్‌ చేస్తుందని తెలిపింది. 

నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావో, దానిపై ఫోకస్‌ పెట్టమని, తన గురించి ఆలోచించొద్దని తెలిపింది. దీంతో నటరాజ్‌ మాస్టర్ మరింత ఎమోషనల్‌ అయ్యారు. చివరకు టీవీలో తన భార్య ఫోటోని చూసుకుని, టీవీ వద్దకెళ్లి భార్యకి ప్రేమతో ముద్దు పెట్టడం ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే నటరాజ్‌ మాస్టర్‌ అంతకు ముందు హౌజ్‌లో ఫైర్‌ అయ్యారు. కొందరు డ్రామాలు ఆడుతున్నారని, బయట అయితే కొట్టేవాడినని తెలిపారు. ఈ క్రమంలో సన్నీతో చిన్నపాటి గొడవ జరిగింది. ఇది చర్చనీయాంశంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..
జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?