ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న అరియానా

Published : Oct 30, 2020, 11:32 PM IST
ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న అరియానా

సారాంశం

ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఎంతో మారారు. స్నేహాలు వచ్చాయి. అనుబంధాలు పెరిగాయి. ఎమోషనల్‌గా మారారు. బిగ్‌బాస్‌ ఇన్ని రోజులు పంచిన జ్ఙాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందామని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ హైలైట్స్ చూపించారు.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 54వ రోజు శుక్రవారం ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. చివర్లో సభ్యులకు ఈ యాభై నాలుగు రోజులు జరిగిన ఎపిసోడ్‌ని రీకలెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు సగం దూరం వచ్చామని చెప్పారు. ఈ జర్నీలో ప్రేమలున్నాయి, ప్రేమించడాలున్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, నవ్వులున్నాయి, ఏడుపు ఉంది. కోపాలున్నాయి, అసహ్యాలున్నాయి, ఎన్నో గాయలున్నాయి. 

ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఎంతో మారారు. స్నేహాలు వచ్చాయి. అనుబంధాలు పెరిగాయి. ఎమోషనల్‌గా మారారు. బిగ్‌బాస్‌ ఇన్ని రోజులు పంచిన జ్ఙాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందామని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ హైలైట్స్ చూపించారు. దీంతో ఇంటిసభ్యులు ఎంతో ఆనందంగా ఫీల్‌అయ్యారు. కొందరు ఎమోషనల్‌ అయ్యారు. 

ముఖ్యంగా అరియానా కన్నీళ్లు పెట్టుకుంది. తనకు తమ కుటుంబం గుర్తుకొస్తుందని ఏడ్చింది. ఈ రెండుమూడు రోజులుగా తాను అందరి మధ్య ఉన్నా, ఒంటరి ఫీలింగ్‌ కలుగుతుందని తెలిపింది. అంతకు ముందు బిగ్‌బాస్‌ ఆమెకి, తాను కోరిన టెడ్డీ బేర్‌ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ సమయంలో కూడా అరియానా కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక అరియానాని అవినాష్‌ ఓదార్చారు. మేమున్నామని ఆమెని ఓదార్చారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్