`ఆర్‌ ఆర్‌ ఆర్‌` కోసం పాట పాడబోతున్న అలియా భట్‌

By Aithagoni RajuFirst Published 30, Oct 2020, 9:08 PM
Highlights

చరణ్‌ సరసన సీతగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్‌  సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ రొమాన్స్ చేయబోతుంది. అయితే ఈ సినిమాలో  అలియా భట్‌ పాట పాడబోతుందట. 

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఆంటిసిపేటెడ్‌గా తెరకెక్కుతున్న సినిమా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`.  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఈ భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతుంది. ఈ భారీ మల్టీస్టారర్‌ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో  అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఇద్దరి పాత్రల టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ వ్యూస్‌ని రాబట్టి  రికార్డులు క్రియేట్‌ చేశాయి. 

ఈ సినిమాలో చరణ్‌ సరసన సీతగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్‌  సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాలో  అలియా భట్‌ పాట పాడబోతుందట. ఇందులో చరణ్‌, అలియాపై ఓ పాట ఉంటుందని, దాన్ని అలియా భట్‌ స్వయంగా ఆలపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె కేవలం హిందీ వెర్షన్‌లోనే ఆ పాటని పాడతారని, భాష పరమైన ఇబ్బంది వల్ల ఇతర భాషల్లో సింగర్స్ పాడతారని టాక్. 

అలియా భట్‌ బేసిక్‌గా మంచి సింగర్‌ కూడా. గతంలో ఆమె `ప్రద`, `స్మైల్‌ దేకె దేఖో` వంటి ఆల్బమ్స్ లోనూ పాటలు పాడింది. దీంతోపాటు తాను నటించిన `హైవే`, `హంపీ శర్మ కి దుల్హానియా`, `ఉడ్తా పంజాబ్‌`, `డియర్‌ జిందగీ`, `బద్రినాథ్‌ కి దుల్హాయినా`, `సడక్‌ 2` వంటి చిత్రాల్లో పాటలు పాడి మెప్పించింది. అవి బాగా ఆదరణ పొందాయి.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 30, Oct 2020, 9:08 PM