బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ సరయు అరెస్ట్.. బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ

Published : Feb 07, 2022, 10:13 PM IST
బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ సరయు అరెస్ట్.. బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ

సారాంశం

సరయు అరెస్ట్ అయ్యారు. ఆమెని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. సరయుపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విసయం తెలిసిందే.

బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్‌, యూట్యూబ్‌ స్టార్‌ సరయు అరెస్ట్ అయ్యారు. ఆమెని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. సరయుపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విసయం తెలిసిందే. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు వీడియోలు రూపొందించారని ఆమెపై రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విశ్వ హిందూ సంఘాల నేత అశోక్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా సరయుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెని విచారిస్తున్నట్టు సమాచారం. 

యూట్యూబ్ లో సరయు ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ యూట్యూబ్ లో బోల్డ్ డైలాగ్స్ తో కొత్త ట్రెండ్ కు తెరతీసింది సరయు. షార్ట్ ఫిలిమ్స్, స్కిట్స్ ని బోల్డ్ డైలాగులతో చేస్తూ వైరల్ సృష్టిస్తోంది ఈ భామ. గత ఏడాది సరయు బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బోల్డ్ డైలాగ్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచిన ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. దీంతో ఊహించని విధంగా సరయు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. 

హౌస్ లో బోల్డ్ గా ఎంటర్టైన్ చేస్తుందని కుర్రాళ్లంతా భావిస్తే తొలి వారంలోనే ఎలిమినేట్‌ అయి నిరాశపరిచింది. రియల్ లైఫ్ లో కూడా సరయు బోల్డ్ యాటిట్యూడ్ తోనే ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ లో సరయు రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలతో సరయు బీభత్సం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా సరయు తాజాగా చిక్కుల్లో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్స్ కోసం తీసిన సాంగ్ వివాదంగా మారింది. ఈ కేసుని బంజారాహిల్స్ పోలీసులు అందుకున్నారు. హోటల్ ప్రమోషన్ కోసం సరయు ఆమె టీం ఓ సాంగ్ చేశారట. 

ఆ సాంగ్ లో గణపతి బొప్ప మోరియా అని రాసిన బ్యాండ్లు ధరించారు. అలాగే మద్యం సేవిస్తున్నట్లు వీడియో చిత్రీకరించారు. ఇది కాస్త తీవ్ర వివాదంగా మారింది. ఈ వీడియో హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందంటూ రాజన్న సిరిసిల్లలో విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం