బిగ్ బాస్2: నాని తీరుతో అసహనం!

By Udayavani DhuliFirst Published 23, Aug 2018, 2:50 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాని తీరుపై ప్రేక్షకులతో పాటు యాజమాన్యం కూడా అసంతృప్తిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి

బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాని తీరుపై ప్రేక్షకులతో పాటు యాజమాన్యం కూడా అసంతృప్తిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నానిని ట్రోల్ చేస్తున్నారు. కొందరు హౌస్ మేట్స్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం పట్ల నాని పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయాలతో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి నానికి ఈ షోని ఫాలో అయ్యేంత సమయం ఉండదు. పబ్లిక్ లో ఈ షోపై ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలు నానికి పెద్దగా తెలియవు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.

వీక్ మొత్తం ఏం జరిగిందనే విషయాలను నాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒక టీమ్ అతడికి చెబుతుంది. స్క్రిప్ట్ మొత్తం కూడా  వారే రాస్తారు. దీంతో వారు చెప్పినట్లు నాని వినడం, ఇచ్చిన స్క్రిప్ట్ స్క్రీన్ మీద చదవడం అన్నట్లుగా తయారయింది షో. స్క్రిప్ట్ రాసే వారు నానికి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే షో వన్ సైడెడ్ గా మారిపోయిందని అంటున్నారు.

ఇది ఒక్కటే కాదు.. నాని బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ని కూడా శనివారమే చిత్రీకరించడం వలన షో నుండి బయటకి ఎవరు వెళ్లబోతున్నారనేది ముందుగానే తెలిసిపోతుంది. ఈ షో ద్వారా తన క్రేజ్ ని మరింత పెంచుకోవాలని భావించిన నాని తన బిజీ షెడ్యూల్స్ కారణంగా కనీసం బిగ్ బాస్ షో కోసం రోజుకి గంట సమయం కూడా కేటాయించలేకపోతున్నాడు. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది. అప్పటికైనా నానిపై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లో మార్పులు వస్తాయేమో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ విన్నర్ అతడు కాకపోతే ధర్నాలే.. యాంకర్ రష్మి కామెంట్స్!

బిగ్ బాస్2: తలనొప్పిగా మారిన పెళ్లి హంగామా

Last Updated 9, Sep 2018, 1:52 PM IST