మెహ్రీన్ ని ఢీ కొట్టిన కారు!

Published : Aug 23, 2018, 01:14 PM ISTUpdated : Sep 09, 2018, 01:11 PM IST
మెహ్రీన్ ని ఢీ కొట్టిన కారు!

సారాంశం

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు యాక్షన్ సీన్స్ లో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. లేడీ ఓరియెంటెడ్ కథల్లో అప్పట్లో విజయశాంతి యాక్షన్ సీన్స్ లో నటించేది. 

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు యాక్షన్ సీన్స్ లో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. లేడీ ఓరియెంటెడ్ కథల్లో అప్పట్లో విజయశాంతి యాక్షన్ సీన్స్ లో నటించేది. ఇప్పుడు అనుష్క, తమన్నా వంటి హీరోయిన్లు యాక్షన్స్ సీన్స్ లో నటించడం చూశాం. తాజాగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా పోరాట సన్నివేశాల్లో నటిస్తోందని సమాచారం.

వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'ఎఫ్2' సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అర్ధరాత్రి హీరోయిన్ ని కారు ఢీ కొట్టే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన మెహ్రీన్ 'యాక్షన్ సీన్స్ లో నటించడం ఇదే మొదటిసారి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నేను ఆలస్యం చేయను' అని తెలిపింది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ లు ఎలా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం