బిగ్ బాస్2: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.. తేజు ఒంటరి కానుందా?

Published : Jul 18, 2018, 11:53 PM IST
బిగ్ బాస్2: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.. తేజు ఒంటరి కానుందా?

సారాంశం

ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని విషయంలో ఓ పేరు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ లో తేజస్వి, రోల్ రైడా, తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ లు నామినేట్ అయ్యారు

బిగ్ బాస్ సీజన్ 1 పూనైలో జరగడంతో ఏ వారమే వారు ఎలిమినేట్ అవుతున్నారనే విషయాలు బయటకు తెలిసేవి కాదు కానీ సీజన్ 2 మాత్రం హైరాబాద్ లో జరుగుతుండడంతో ఇప్పటికే లీకులు మొదలయ్యాయి. గతవారం భానుశ్రీ ఎలిమినేట్ కాబోతుందనే విషయం ముందుగానే అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని విషయంలో ఓ పేరు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

ఈ వారం ఎలిమినేషన్ లో తేజస్వి, రోల్ రైడా, తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ లు నామినేట్ అయ్యారు. ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనే ఆసక్తి కలుగుతోంది. అయితే ఈ ప్రక్రియకు అంత పకడ్బందీగా నిర్వహించకపోవడంతో ఎవరు ఎలిమినేట్  కాబోతున్నారని విషయం ముందే నెట్ లో లీకైంది. స్టార్ మా కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. అందులో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే విషయం ఉంది.

ఈ ఓటింగ్ ప్రకారం దీప్తికి అత్యధిక ఓట్లు రాగా, ఆ తరువాతి స్థానంలో రోల్ రైడా, మూడో స్థానంలో తేజస్వి, నాలుగో స్థానంలో తనీష్ ఉన్నారు. ఇక అందరికంటే తక్కువ ఓట్లతో సామ్రాట్ వెనుకంజలో ఉన్నాడు. ఓటింగ్స్ వేయడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లెక్కలు మారే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే సామ్రాట్ బయటకు వెళ్లిపోతాడనే  ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ నిజంగానే అతడు బయటకు వస్తే తేజస్వి ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు