
బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన కౌశల్ కి మంచి పాపులారిటీ దక్కింది. ఆయన కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది. బిగ్ బాస్ షోకి అత్యధిక టీఆర్ఫీ రేటింగులు రావడంలో కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నిజానికి బిగ్ బాస్ కి వచ్చేవరకు కౌశల్ ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. సీరియళ్లు చూసేవారికి మాత్రం అతడు సుపరిచితుడే. కానీ బిగ్ బాస్ షోలో అతడి ప్రవర్తన నచ్చి వేల మంది అభిమానులు పుట్టుకొచ్చారు.
ఇంత చేస్తోన్న కౌశల్ కి బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటాడనే విషయం ఆరా తీయగా హౌస్ లో మిగిలిన సెలబ్రిటీలతో పోలిస్తే కౌశల్ కే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంత అనే విషయాన్ని బయటకి చెప్పనప్పటికీ హౌస్ లో అందరికంటే లీస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఆయనే అనే విషయం తెలుస్తోంది.
ఇప్పుడు ఆ కంటెస్టెంట్ కారణంగానే షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక షో నుండి బయటకి వచ్చిన తరువాత ఆయనకున్న క్రేజ్ తో మంచి స్థాయికి వెళ్లడం ఖాయమని అంటున్నారు.
ఇది కూడా చదవండి..
బిగ్ బాస్2: కౌశల్ వల్లే ఇదంతా.. పెద్ద ప్లాన్ తో వచ్చారు.. గీతామాధురి కామెంట్స్!