కమెడియన్ చిరంజీవిని అవమానిస్తున్నాడా..?

Published : Sep 29, 2018, 04:41 PM IST
కమెడియన్ చిరంజీవిని అవమానిస్తున్నాడా..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సంప్రదించిన నిర్మాతలెందరో.. కానీ చరణ్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తన తండ్రి వెండితెరపై క్రియేట్ చేసిన సెన్సేషన్ ని రీక్రియేట్ చేసే విషయంలో చరణ్ వెనుకడుగు వేశాడు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సంప్రదించిన నిర్మాతలెందరో.. కానీ చరణ్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తన తండ్రి వెండితెరపై క్రియేట్ చేసిన సెన్సేషన్ ని రీక్రియేట్ చేసే విషయంలో చరణ్ వెనుకడుగు వేశాడు.

అయితే ఇప్పుడు అదే టైటిల్ తో కమెడియన్ షకలక శంకర్ సినిమా చేస్తూ మెగాస్టార్ ఇన్సల్ట్ చేస్తున్నారు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన శంకర్ ఆ తరువాత హీరోగా మారి సినిమా చేశాడు. ఇప్పుడు హీరోగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో హనుమాన్ కృష్ణ అనే నూతన దర్శకుడితో కలిసి పని చేయబోతున్నాడు.

ఈ సినిమాకి 'ఖైదీ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు. దసరా నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. చిరంజీవిని తగ్గించే విధంగా ఈ సినిమా ఉండదని మేకర్స్  చెబుతున్నప్పటికీ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది చిరంజీవికి పెద్ద అవమానమంటూ శంకర్ పై విమర్శలు చేస్తున్నారు.

శంకర్ హీరోగా పరిచయమైన 'డ్రైవర్ రాముడు' అనే సినిమాతోనే.. దివంగత ఎన్టీఆర్ నటించిన సినిమాలలో 'డ్రైవర్ రాముడు' ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మొదటి సినిమాకు ఎన్టీఆర్ టైటిల్ పెట్టుకున్న శంకర్ ఈసారి చిరంజీవి టైటిల్ మీద పడ్డాడు.   

PREV
click me!

Recommended Stories

CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు