బిగ్ బాస్2: డిజాస్టర్ నువ్వు నాని.. కౌశల్ ఆర్మీ ఎటాక్!

Published : Sep 17, 2018, 11:54 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
బిగ్ బాస్2:  డిజాస్టర్ నువ్వు  నాని.. కౌశల్ ఆర్మీ ఎటాక్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రానంత ఫాలోయింగ్ కౌశల్ కి దక్కింది. అతడి కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ తయారైంది. ఈ ఆర్మీ కౌశల్ ఎలిమినేట్ కాకుండా చూడడం, హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎలిమినేట్ చేయడం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి

బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రానంత ఫాలోయింగ్ కౌశల్ కి దక్కింది. అతడి కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ తయారైంది. ఈ ఆర్మీ కౌశల్ ఎలిమినేట్ కాకుండా చూడడం, హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎలిమినేట్ చేయడం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి.

కౌశల్ సీజన్ మొత్తం నామినేట్ అయినా.. ఆయన మాత్రం ఎలిమినేట్ కావడం లేదంటే దానికి కారణం కౌశల్ ఆర్మీ. శని, ఆదివారాల్లో హోస్ట్ నాని.. కౌశల్ ని ప్రశ్నించిన తీరు పట్ల కౌశల్ ఆర్మీ అసహనం వ్యక్తం చేసింది.

మిగిలిన హౌస్ మేట్స్ బూతులు తిట్టినప్పుడు ప్రశ్నించని నాని.. కౌశల్ విషయానికొచ్చేసరికి అతడిని టార్గెట్ చేస్తున్నారని మరోసారి సోషల్ మీడియాలో నానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంచాలకుడిగా నువ్వు డిజాస్టర్ కౌశల్ అంటూ నాని చేసిన కామెంట్స్ పై కౌశల్ ఆర్మీ బాగా హర్ట్ అయినట్లుంది.

దీంతో నానిని టార్గెట్ చేస్తూ.. తేజస్వి హౌస్ లో బూతులు మాట్లాడినప్పుడు, గీతా.. కౌశల్ ని ఉద్దేశిస్తూ తిట్టినప్పుడు, గణేష్ మైక్ తీసేసి మరీ బిగ్ బాస్ ని విమర్శించినప్పుడు అడగని నాని ఇప్పుడు కౌశల్ చేసిన చిన్న తప్పుని ఎత్తి చూపిస్తూ అతడిని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కౌశల్ ఆర్మీ అతడిని నిందిస్తుంది. హోస్ట్ గా నువ్వు డిజాస్టర్ నాని అంటూ హ్యాష్  ట్యాగ్స్ కూడా ఇస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?