Bigg Boss Telugu 10: రామ్ ప్రసాద్ కి షాక్ ఇచ్చిన దేబ్జానీ, వాడీ వేడిగా 12వ వారం నామినేషన్లు

Published : Nov 23, 2026, 10:45 PM IST
Bigg Boss Telugu 10

సారాంశం

Bigg Boss Telugu10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కీలక మలుపు తిరిగింది. కంటెస్టెంట్లు పన్నెండో వారంలోకి అడుగుపెట్టగా, ఇంట్లో దాదాపు డజను మంది సభ్యులు ఉన్నారు. మిగిలింది ఇంకా నాలుగు వారాలే . ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది.

ఎవరి గేమ్ వాళ్లదే.. ముగిస్తున్న గ్రూపుల పర్వం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటున్న వేళ, కలిసి ఆడే ఆటలకు స్వస్తి చెప్పి వ్యక్తిగతంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో కంటెస్టెంట్లు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియలో కెప్టెన్ అమన్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, దేబ్జానీ అతడిని "పక్కకు పో" అనడంతో అమన్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇద్దరి మధ్య ఫైట్ గట్టిగానే జరిగింది.

వర్షిణి vs సుధీర్ – వాడివేడి వాదనలు

ఇక ఈ ఎపిసోడ్ లో హైలైట్‌గా నిలిచిన అంశాల్లో వర్షిణి, సుధీర్‌ల మధ్య నామినేషన్ వాదన ఒకటి. 'రివార్డ్ రివేంజ్' టాస్క్‌లో వర్షిణి వ్యవహరించిన తీరును కారణంగా చూపుతూ సుధీర్ ఆమెను నామినేట్ చేశాడు. నువ్వు, శ్వేత కలిసి బాల్స్ వేస్తున్నారని భావించే మిగతా వారికి ఇచ్చానని వర్షిణి వివరణ ఇచ్చింది. ముకేష్‌కు సపోర్ట్ లభిస్తుందనే ఆ రోజు నాకు కావాలని సపోర్ట్ చేయలేదని రాం ప్రసాద్ కూడా ఆరోపించగా, వర్షిణి దాన్ని ఖండిస్తూ తల అడ్డంగా ఊపింది.

సంచాలక్‌గా రోహిత్ ఉన్నప్పుడు తాను సాయం చేస్తే తప్పు లేదని వర్షిణి వాదించింది. "నన్ను చూడు.. నాతో మాట్లాడు" అంటూ ఆమె పట్టుబట్టగా, తప్పు చేశావా లేదా చెప్పమంటే ఇతరుల పేర్లు చెబుతున్నావని సుధీర్ నిలదీశాడు. "నీకు ఎందుకు చెప్పాలి బై" అంటూ వర్షిణి ఎదురుతిరగగా, నువ్వు నీ గురించి కాకుండా పక్క వాళ్ల గురించి ఆడుతున్నావని సుధీర్ విమర్శించి, చివరకు కాఫీ మొహాన కొట్టి నామినేట్ చేశాడు.

దేబ్జానీ – రామ్ ప్రసాద్ మధ్య ఊహించని నామినేషన్

మరోవైపు, రాం ప్రసాద్‌ను దేబ్జానీ నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్సీ తనకు ఎంత ముఖ్యమో తెలిసినప్పటికీ, ఆ రోజు రాం ప్రసాద్ తనకు సపోర్ట్ చేయలేదని దేబ్జానీ కారణం చెప్పింది. దీనికి బదులుగా రాం ప్రసాద్ స్పందిస్తూ, కెప్టెన్ చేసే అవకాశం తనకు వస్తే దేబ్జానీనే చేస్తానని, ఆమెపై అంత ప్రేమ ఉందని చెప్పాడు. అయితే "కాఫీ అయిపోయింది" అని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమె ఇంత సెల్ఫీష్‌గా, స్వార్థంగా ఉంటుందని ఊహించలేదని అన్నాడు.

శివ్, ముకేష్‌ల పరిస్థితి

ఈ వారం నామినేషన్లలో శివ్, ముకేష్‌ల అంశాలు కూడా చర్చనీయాంశంగా నిలుస్తున్నాయి. త్రిగుణ్‌కు బయట ఉన్న క్రేజ్ దృష్ట్యా అతనితో గొడవలు పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ వస్తుందన్న ఉద్దేశంతోనే శివ్ వారం మొత్తం బాగానే ఉండి నామినేషన్ల సమయంలో ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే డిక్టేటర్‌గా ముకేష్ విఫలమైన నేపథ్యంలో, గత కొంతకాలంగా నామినేషన్లలో ఉంటున్న అతడిని ఈ వారం నరేష్, రాం ప్రసాద్ వంటి వారు కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Trisha Peravai: రాజకీయాల వైపు తొలి అడుగు..? 'ఇళయ పురట్చి తలైవిగా త్రిష, పొలిటికల్ గ్రౌండ్‌లో కొత్త సంచలనం
Dhanush Sons: నా పిల్లలు కూడా నాలాగే.. యాత్రా, లింగా గురించి ధనుష్ ఎమోషనల్ కామెంట్స్