Bigg Boss Telugu 7: ఓటింగ్లో ఉల్టా పల్టా.. డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్స్!

By Sambi Reddy  |  First Published Nov 2, 2023, 4:45 PM IST

నామినేషన్స్ ప్రక్రియ ముగియగా మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ మొదలైంది. నామినేషన్స్ లో 8 మంది ఉండగా టాప్ కంటెస్టెంట్స్ వెనుకబడినట్లు సమాచారం అందుతుంది. 
 


9వ వారానికి అమర్ దీప్, భోలే, తేజ, శోభా శెట్టి, అశ్విని, యావర్, రతిక, అర్జున్, ప్రియాంక నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఇంటిని వీడనున్నారు. గత ఎనిమిది వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యారు. 8వ వారం సందీప్ ఇంటిని వీడాడు. నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది. 

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళి పరిశీలిస్తే... షాకింగ్ రిజల్ట్ వెలుగు చూశాయి.  టాప్ సెలెబ్స్ రేసులో వెనుకబడ్డారు. ఎలాంటి ఫేమ్ లేని యావర్ మాత్రం దూసుకుపోతున్నాడు. మొదటి స్థానంలో ఉన్న యావర్ ఏకంగా 24 శాతానికి పైగా ఓటింగ్ రాబట్టినట్లు సమాచారం. రెండో స్థానంలో భోలే ఉన్నాడట. ఇది అనూహ్య పరిణామం. 

Latest Videos

హౌస్ మేట్స్ భోలేని టార్గెట్ చేశారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలేకి లక్ష్యం లేదు. సీరియస్ గా ఆడటం లేదని కామెంట్స్ చేశారు. అయితే జనాల్లో భోలేకి భారీ ఫాలోయింగ్ ఉన్నట్లు ఓటింగ్ చేస్తే అర్థం అవుతుంది. మూడో స్థానంలో అమర్, నాలుగో స్థానంలో రతిక, ఐదో స్థానంలో అర్జున్ ఉన్నారట. తేజ ఆరో స్థానంలో ప్రియాంక ఏడో స్థానంలో, శోభా చివరి స్థానంలో ఉందట. చూస్తే ఈ వారం శోభా ఇంటికి వీడటం ఖాయం అంటున్నారు. 

గత వారమే శోభా ఎలిమినేట్ కావాల్సింది. స్వల్ప ఓట్ల తేడాతో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఫెయిర్ ఎలిమినేషన్ జరిగితే ప్రియాంక లేదా శోభా ఇంటికి వెళతారని టాక్. ఓటింగ్ కి మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. ఫలితాలు ఎలా మారుతాయో చూడాలి. ప్రస్తుతం హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. 
 

click me!