రివేంజ్ తీర్చుకున్నాడు... అక్కడ చిరంజీవిని తోక్కేసిన బాలయ్య!

By Sambi Reddy  |  First Published Nov 2, 2023, 4:14 PM IST


ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అనూహ్యంగా బుల్లితెర మీద బాలయ్యదే పై చేయి అయ్యింది. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ డీలా పడ్డారు. 
 


2023 సంక్రాంతి బరిలో నలుగురు బడా హీరోలు దిగారు. చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ తమ చిత్రాలతో సత్తా చాటారు. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొంది. అయితే విన్నర్ మాత్రం చిరంజీవి అయ్యారు. వాల్తేరు వీరయ్య హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నుండే వసూళ్లు దుమ్ముదులిపాయి. వాల్తేర్ వీరయ్య ఫుల్ రన్ ముగిసే నాటికి రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 

వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేసారు. దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక వీరసింహారెడ్డి చిత్ర విషయానికి వస్తే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది. దాంతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. వీరసింహారెడ్డి రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించాడు. 

Latest Videos

సంక్రాంతి బరిలో బాలయ్య మీద చిరంజీవిది పై చేయి అయ్యింది. సంక్రాంతి విన్నర్ గా వాల్తేరు వీరయ్య నిలిచింది. అయితే బుల్లితెర మీద బాలయ్య హవా సాగింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ లో వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి ఎక్కువ టీఆర్పీ రాబట్టింది. వాల్తేరు వీరయ్య ఫస్ట్ ప్రీమియర్ కి కేవలం 5.14 టీఆర్పీ మాత్రమే రాబట్టింది. వాల్తేరు వీరయ్య మాత్రం 8.83 టీఆర్పీ అందుకుంది. 

వాల్తేరు వీరయ్య కంటే మూడు టీఆర్పీ పాయింట్స్ అదనంగా వీరసింహారెడ్డికి దక్కాయి. వాస్తవంలో రెండు చిత్రాలు నిరాశపరిచాయని చెప్పొచ్చు. టైరు టూ హీరోల రేంజ్ టీఆర్పీ ఈ చిత్రాలకు వచ్చింది. ఆ రెండింటిలో వీరసింహారెడ్డి బెటర్ అనిపించింది. తెలుగులో అల వైకుంఠపురంలో 29.4 టీఆర్పీతో అత్యధిక రేటింగ్ అందుకున్న మూవీగా ఉంది. 

ఇక రెండో స్థానంలో సరిలేరు నీకెవ్వరు ఉంది. మహేష్ బాబు నటించిన ఈ మూవీ 23.4 టీఆర్పీ అందుకుంది. ఇక మూడో స్థానంలో 22.7 టీఆర్పీతో బాహుబలి ఉంది. ఈ చిత్రాల టీఆర్పీతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో ఎక్కడో ఉన్నాయి... 
 

click me!