టాప్ సెలెబ్స్ లో ఒకరిగా బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టింది షకీలా. ఆమె జర్నీ రెండు వారాలకే ముగిసింది. కాగా షకీలా చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 7 రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మందితో మొదలైన షోలో 12 మంది ఉన్నారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ వీక్లో 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ పవర్ అస్త్ర గెలవడం వలన సేవ్ అయ్యాడు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ తర్వాత ఒక్కొక్కరిగా సేఫ్ అయ్యారు. డేంజర్ జోన్లో తేజా, షకీలా మిగిలారు.
వీరిద్దరిలో తక్కువ ఓట్లు తెచ్చుకున్న షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వేదిక మీద మాట్లాడుతూ షకీలా కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకున్నారు. వయసురీత్యా షకీలా హౌస్లో నెమ్మదిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె పదే పదే చెప్పడం, అదే తీరుతో ఆమె గేమ్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ కాలేదు. అందుకే ఆమెకు ఓట్లు పడలేదు.
మరి రెండు వారాలు ఉన్న షకీలా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వాదన మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం షకీలా వారానికి రూ. 3.5 నుండి 4 లక్షల ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టారట. ఆ లెక్కన షకీలాకు రూ. 7 నుండి 8 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారని వినికిడి. నటిగా ఆమెకు ఆఫర్స్ తగ్గిన నేపథ్యంలో ఇది చెప్పుకోదగ్గ పైకమే అనాలి. కానీ కనీసం ఓ ఐదు వారాలు ఇంట్లో ఉంటే షకీలాకు పెద్ద మొత్తం దక్కేది.