‘మజ్ను’ డైరెక్టర్ విరించి వర్మ (Virinchi Varma) చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన షార్ట్ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ‘ఉయ్యాల జంపాల’, నానితో ‘మజ్ను’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే. అయినా తన దర్శక ప్రతిభతో ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశారు. ఈ రెండు సినిమాల్లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం పొలిటికల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రానికి ‘జితేందర్ రెడ్డి’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
ఇక తాజాగా ‘జితేందర్ రెడ్డి’ ప్రమాణస్వీకారం పేరుతో ఓ షార్ట్ వీడియోను పంచుకున్నారు. అసలు ఎవరు ఈ 'జితేందర్ రెడ్డి'. ఏముంది ఆయన గురించి తెలుసుకోవడానికి.. అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. రీసెంట్ గా వచ్చిన పోస్టర్ సినిమా పైన ఆసక్తి పెంచగా ఇవాళ విడుదలైన 'జితేందర్ రెడ్డి' ఇచ్చిన హామీ వీడియో అసలు ఎవరు ఈ 'జితేందర్ రెడ్డి' అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. వీడియోలో 'జితేందర్ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ అలానే చూపించి సినిమా ఆసక్తిని పెంచారు. అలాగే 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అంటూ రాసిన కొటేషన్లు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
undefined
కాగా ఈ సినిమా లో 'జితేందర్ రెడ్డి' గా చేసింది ఎవరు అనే తెలియజేసేందుకు చిత్ర యూనిట్ ఈ నెల 21న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా, 1980 లో జరిగిన ఒక పిరియడిక్ కథగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇన్సిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఈ చిత్రం ఉండబోతుందని అంటున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా చిత్రం వస్తుందని తెలుస్తోంది. ఆయన చిన్నవయస్సులోనే చనిపోవడం గమానర్హాం. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత మరిన్ని డిటేయిల్స్ రానున్నాయి.