OTTలో దుమ్మురేపుతున్న `ఖుషి`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`, `ప్రేమ విమానం`..

Google News Follow Us

సారాంశం

ఇటీవల కాలంలో చాలా సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీలోనూ బాగా ఆదరణ పొందుతున్నాయి. ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. `ఖుషి`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`, `ప్రేమ విమానం` చిత్రాలు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. 

థియేటర్లో సందడి చేసిన ప్రముఖ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. అక్కడ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఊహించని రెస్పాన్స్ తో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అత్యధిక వ్యూస్‌ సాధించిన చిత్రాలుగా నిలుస్తున్నాయి. వాటిలో విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటించిన `ఖుషి`, అలాగే అనుష్క, నవీన్‌ పొలిశెట్టి నటించిన `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`తోపాటు అనసూయ, సంగీత్‌ శోభన్‌, అభిషేక్‌ నామా పిల్లలు నటించిన `ప్రేమ విమానం` ఉన్నాయి. 

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటించిన శివ నిర్వాణ మూవీ `ఖుషి` నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ నెల ఒకటి నుంచి ఇది ఓటీటీలో ప్లేఅవుతుంది. ఇప్పటి వరకు వ్యూస్‌ని బట్టి ఇది నెట్‌ ఫ్లిక్స్ లో ట్రెండింగ్‌లో ఉంది. టాప్‌ 10 ఇండియన్ మూవీస్‌ జాబితాలో `ఖుషి` హిందీ వెర్షన్‌ ఏడో స్థానంలో నిలిచింది. సాంప్రదాయాలు, నమ్మకాలు ప్రేమ, బంధానికి అడ్డు కాదనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లో మంచి ఆదరణ పొందింది. ఓటీటీలో మరింతగా ఆకట్టుకుంటుంది. 

మరోవైపు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సైతం ట్రెండింగ్‌లో ఉంది. నెట్‌ ఫ్లిక్స్ లోనూ విడుదలైన సినిమా `ఖుషి` కంటే ముందే ఉంది. ఇది టాప్‌ 4లో నిలవడం విశేషం. ఇది `ఖుషి`కి వారం తర్వాత రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ కావడమనే కాన్సెప్ట్ తో ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. 

మరోవైపు అనసూ, సంగీత్‌ శోభన్‌, శాన్వి, నిర్మాత అభిషేక్‌ నామా పిల్లలు నటించిన `ప్రేమ విమానం` సినిమా కూడా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది. డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలైందీ చిత్రం ఓ వైపు లవ్‌ స్టోరీ, మరోవైపు విమానం ఎక్కాలనే కోరిక.. ఈ రెండు కథలకు లింక్‌ పెట్టిన తీరు, వాటిని కలిపిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. దీంతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటుంది. అక్టోబర్‌ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు 50 మిలియన్స్ స్ట్రీమింగ్‌ మినిట్స్ వ్యూస్‌ని సాధించి రికార్డ్ సృష్టించింది. ఫీల్‌ గుడ్‌ మూవీగా ఓటీటీ ఆడియెన్స్ ని అలరిస్తుంది. సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.  
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on