Bigg Boss Telugu 7 : లాస్ట్ ఎపిసోడ్ లో అమర్ కు ఇచ్చిపడేసినా శివాజీ, అర్జున్.. శ్రీముఖి ఎంట్రీతో రచ్చరచ్చ

Published : Dec 17, 2023, 12:35 AM IST
Bigg Boss Telugu  7 : లాస్ట్ ఎపిసోడ్ లో అమర్ కు ఇచ్చిపడేసినా శివాజీ, అర్జున్.. శ్రీముఖి ఎంట్రీతో రచ్చరచ్చ

సారాంశం

రేపటితో బిగ్ బాగ్ తెలుగు 7 టైటిల్ విన్నర్ తేలనుంది. ఇక ఈరోజటి లాస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లను బిగ్ బాస్ పలు రకాలుగా టెంప్ట్ చేసినా ఏమాత్రం తగ్గలేదు. తమకు టైటిల్ కావాల్సిందే అన్నట్టుగా రేసు లో నిల్చున్నారు. ఈ క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి.   

బిగ్ బాస్ తెలుగు సీజ్ 7 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం షో ముగింపు దశకురావడంతో టైటిల్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి ఆడియెన్స్ లో నెలకొంది. ఈ సందద్భంగా ఈరోజటి ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మొదట హౌజ్ లో ఫన్నీ టాక్స్ తో కంటెస్టెంట్లు సందడి చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గేమ్ ను ఇచ్చారు. ఫైనల్స్ లో ఉన్న ఆరుగురు సభ్యులను ఒకరి పాత్రను మరొకరు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో మొదట అమర్ దీప్ గా అర్జున్, ఆ తర్వాత శివాజీ ఇమిటేట్ చేశారు. ఇద్దరూ అమర్ దీప్ లోని యాంగర్ యాంగిల్ నే ప్రదర్శించారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను  అర్జున్, యావర్ ఇమిటేట్ చేశారు. ఈ సమయంలో ఇద్దరూ అతనిలోని ఎమోషనల్ యాంగిల్ నూ చూపించే ప్రయత్నం చేశారు. అర్జున్ మాత్రం పల్లవి ప్రశాంత్ బాడీ లాంగ్వేజ్, యాస, భాషతో అదరగొట్టారు. 

ఇక ఆ తర్వాత శివాజీని ఇమిటేట్ చేసిన ప్రియాంక అతను హౌజ్ లో చేసిన కొన్ని ఇరిటేటింగ్ అంశాలనే లేవనెత్తేలా ప్రదర్శించింది. ఇక శివాజీ మాత్రం అమర్ దీప్ ను దించేశారు. ఈ గేమ్ తర్వాత హౌజ్ లోకి యాంకర్ శ్రీముఖి (Sreemukhi) ఎంట్రీ ఇచ్చింది. కంటెస్టెంట్లతో కలిసి సందడి చేసింది. పలు టాస్క్ లతో ఆకట్టుకుంది. కొన్ని సాంగ్స్ కు డాన్స్ చేయించి అదరగొట్టింది. ఆ తర్వాత ట్రూత్ అండ్ డేర్ గేమ్ తో ఆడించింది. బిగ్ హౌజ్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎవరితో దగ్గర ఉంటరని అడగ్గా.. నైని పావని తో టచ్ లో ఉంటారన్నారు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లు కూడా ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఆడారు. యావర్ తో శ్రీముఖి రొమాంటిక్ డాన్స్ చేసి ఆకట్టుకుంది. 

ఆ తర్వాత కంటెస్టెంట్లకు బిగ్ బాస్ డబ్బుతో బయటకు వెళ్లే అవకాశాన్ని అందించారు. ఈ సందర్భంగా హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూట్ కేసు ను ఆఫర్ చేశారు. మొదట రూ.3 లక్షలతో.. ఆ తర్వాత రూ.5 లక్షలతో ఆఫర్ చెప్పారు. కానీ ఇంటి సభ్యులెవరూ అంగీకరించలేదు. ఈ సమయంలో ఐదు లక్షలైతే ఎవరూ స్పందించరంటూ శివాజీ ఫన్నీ కమెంట్స్ చేశారు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఎంత ఆశిస్తున్నారో కూడా శివాజీ అడిగి చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత బిగ్ బాస్ బ్రిఫ్ కేస్ సూట్ ను రూ.10 లక్షలకు పెంచినా ఎవరూ టెంప్ట్ కాలేదు. ఇక ఫైనల్స్ లో ఎవరు ఎలా ఎలిమెంట్ కానున్నారు.... ఎలా బిగ్ బాస్ ఆఫర్స్ కు టెంప్ట్ కానున్నారనే విషయాలను రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే