Bigg Boss Telugu 6: ఫస్ట్ వీకే చెక్కేయనున్న టాప్ కంటెస్టెంట్!  

Published : Sep 10, 2022, 04:11 PM IST
Bigg Boss Telugu 6: ఫస్ట్ వీకే చెక్కేయనున్న టాప్ కంటెస్టెంట్!  

సారాంశం

బిగ్ బాస్ షో ఫస్ట్ ఎలిమినేషన్ కి వేళయింది.  మొత్తం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ ని వీడనున్నారో విశ్వసనీయ సమాచారం బయటికి వచ్చింది.

బిగ్ బాస్ తెలుగు 6 ఫస్ట్ వీక్ కి దగ్గరైంది. మరి వారాంతం వస్తుంది అంటే ఎవరికో ఒకరికి మూడినట్లే. అందులోనూ ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఇంకా టెన్షన్ నెలకొంటుంది. అసలు హౌస్ ఏమిటో అర్థం కాకముందే ,  టాలెంట్ చూపించక మునుపే వెళ్ళిపోవాల్సి వస్తుంది. దీంతో ఫస్ట్ వీక్ హౌస్ ని వీడే కంటెస్టెంట్ ఎవరనే ఆసక్తి కొనసాగుతుంది. ఈ వారం ఎదురుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆదివారం ఈ ఏడుగురు సభ్యుల్లో ఒకరు బయటికి వెళ్లనున్నారు. 

ఆరోహిరావు, ఫైమా, సింగర్ రేవంత్, అభినయశ్రీ, ఇనయ సుల్తానా, చలాకీ చంటి, శ్రీ సత్య ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. సింగర్ రేవంత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అతడికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ సీజన్ టాప్ సెలెబ్రిటీ. అలాగే చలాకీ చంటి, ఫైమా జబర్దస్త్ కమెడియన్స్ గా ప్రేక్షకులకు  బాగా పరిచయం. అందులోనూ ఫైమా వయసులో చిన్నదైనా గమ్ముగా ఉండకుండా తన గేమ్ మొదలుపెట్టింది. 

ఆరోహిరావు ప్రేమకథలు అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. శుక్రవారం వరకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఇనయ, అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కావచ్చంటే అభినయశ్రీ పేరు వినిపిస్తుంది. మంచో చెడో ఇనయ నోరు తెచ్చి మాట్లాడుతుంది. ఒకటి రెండు టాస్క్స్ లో పాల్గొంది. అభినయశ్రీ మాత్రం మౌనంగా ఉంటున్నారు. అసలు బిగ్ బాస్ కెమెరాలు ఫోకస్ చేసేలా ఆమె ఏమీ చేయడం లేదు. ఈ క్రమంలో అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్