సోనుసూద్ కు అభిమాని మరిచిపోలేని బహుమతి.. అది చూసి సోనూ ఏమన్నాడంటే?

Published : Sep 10, 2022, 03:25 PM IST
సోనుసూద్ కు అభిమాని మరిచిపోలేని బహుమతి.. అది చూసి సోనూ ఏమన్నాడంటే?

సారాంశం

రియల్ లైఫ్ హీరో సోనూసూద్ (Sonu Sood) కరోనా పరిస్థితుల నుంచి ఎంతో మందిని కాపాడారు. దీంతో ఆయన అభిమానులు ఇప్పటికీ ఏదోలా సోనూను కలుస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మరో వ్యక్తి  సోనూను కలిసి మరిచిపోలేని బహుమతిని ఇచ్చారు.   

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూసూద్ కరోనా తర్వాత దేశంలో ప్రతి ఒక్కరికీ రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. మహ్మరీ కరోనాతో ఏర్పడిన దుర్భర పరిస్థితులకు 2020లో పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు ఎంతగానో ఇబ్బందిపడ్డారు.  వారందరికీ సోనూ వందల కోట్ల ఖర్చుతో సహాయ సహకారాలు అందించాడు. మానవత్వంతో సాటి మనుషులకు ఎనలేని సాయం చేశాడు. దీంతో సోనూను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంది. ఆయన్ని దైవంగా కోలిచేవారు ఉన్నారు. అయితే గత రెండేండ్లుగా సోనూ ద్వారా సాయం అందుకున్న వారు ఆయన్ని కలుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

ఒక్కోక్కరు ఒక్కో విధంగా సోనూ సూద్ ఇంటిని చేరుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పుడూ మరవబోమంటూ చిరు సత్కారాలు చేస్తున్నారు. ఇటీవలనే వరంగల్ కు చెందిన ఓ వ్యక్తి తన కూతురితో ముంబై వరకు ర్యాలీగా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో అభిమాని సోనూ సూద్ ను కలిసి ఆయన చేస్తున్న సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు మరిచిపోలేని బహుమతిని అందించారు. 

తాజాగా నార్త్ కు చెందిన మధు గుర్జార్ అనే వ్యక్తి సోనూసూద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోన్  సూద్ ఫొటోను బహుకరించారు. అయితే తన రక్తంతో సోనూ ఫొటోను పెయింట్ వేయించి, ఫ్రేమ్ కట్టించినట్టు అభిమాని తెలిపారు. దీంతో సోనూసూద్ సంతోషించారు. ఆ తర్వాత తన ఫొటోను గీయడం కోసం రక్తాన్ని వేస్ట్ చేయొద్దని, రక్తదానం చేస్తే సంతోషించేవాడినని సూచించారు. ఏదేమైనా తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ట్వీట్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సోనూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

ఇదిలా ఉంటే సోనూసూద్ అటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఇటు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. చివరిగా తెలుగులో మెగా స్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మూవీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ‘తమిళరసన్’, మరో హిందీ ఫిల్మ్ ‘ఫతే’లో నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు