
బిగ్ బాస్ హౌస్ లో నెక్స్ట్ కెప్టెన్ ఎంపిక కోసం టాస్క్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఈ వారం బాగా ఎంటర్టైన్ చేసిన ఆరుగురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పాలని ప్రస్తుత కెప్టెన్ కీర్తిని ఆదేశించాడు. బిగ్ బాస్ ఆదేశం మేరకు ఫైమా, బాల ఆదిత్య, సింగర్ రేవంత్, రాజ్, గీతూ, సూర్యలను కీర్తి ప్రకటించింది. దీంతో మిగతా కంటెస్టెంట్స్ కొంచెం నొచ్చుకున్నారు. ముఖ్యంగా రోహిత్... తన భార్య మెరీనా అర్ధరాత్రి మేల్కొని గెటప్స్ వేసుకొని ఎంటర్టైన్ చేసింది, అయినా అవకాశం ఇవ్వలేదని అన్నారు.
ఇక కీర్తి ఎంపిక చేసిన ఆరుగురు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉంచిన కర్రలను గొడ్డలిలో కట్ చేయాలి. పూర్తిగా కట్ చేస్తే కర్రలకు కట్టి ఉన్న బ్యాగ్ క్రింద పడుతుంది. ఆ బ్యాగ్ లో బిగ్ బాస్ లోగో కి సంబంధించిన ముక్కలు ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో అమర్చాలి.ఈ టాస్క్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ముగ్గురు కంటెస్టెంట్స్ నెక్స్ట్ లెవల్ కి వెళతారని బిగ్ బాస్ సూచించాడు.
ఈ ఫిజికల్ అండ్ మైండ్ గేమ్ లో సూర్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చాలా తక్కువ సమయంలో టాస్క్ పూర్తి చేశాడు. తర్వాత స్థానాల్లో బాల ఆదిత్య, రేవంత్ నిలిచారు.వీరిలో ఒకరు వచ్చేవారానికి ఇంటి కెప్టెన్ అవుతాడు. ఈ ముగ్గురు నెక్స్ట్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడనున్నారు. గీతూ, ఫైమా, రాజ్ పోటీ నుండి నిష్క్రమించారు. ఇక సూర్య క్వాలిఫై కావడంతో ఇనయా గట్టిగా కౌగిలించుకుంది. నిన్న ఎపిసోడ్ లో తనకు సూర్య అంటే చాలా ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది.
కాగా ఈ వారం ఎలిమినేషన్ లో చంటి, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డి, మెరీనా, బాల ఆదిత్య, వాసంతి, అర్జున్ ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వరం హౌస్ వీడనున్నారు. కాగా 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు ఎలిమినేటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.