Bigg Boss Telugu 6: శ్రీసత్యకు బిగ్ షాక్... డిస్ క్వాలిఫై చేసిన బిగ్ బాస్!

Published : Nov 15, 2022, 01:01 PM IST
Bigg Boss Telugu 6: శ్రీసత్యకు బిగ్ షాక్... డిస్ క్వాలిఫై చేసిన బిగ్ బాస్!

సారాంశం

కంటెస్టెంట్ శ్రీసత్యకు బిగ్ షాక్ తగిలింది. రూల్స్ అతిక్రమించిన కారణంగా బిగ్ బాస్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. బిగ్ బాస్ నిర్ణయానికి శ్రీసత్య కన్నీరు పెట్టుకుంది.   

పది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 11వ వారంలో అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు ఇంటి సభ్యుల తలపై చెత్త వేసి నామినేట్ చేయాల్సి ఉంది. ఫైమా కెప్టెన్ కావడంతో ఆమెకు నామినేషన్స్ నుండి మినహాయింపు దక్కింది. ఆమెను ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆదేశించారు. మిగిలిన తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, ఇనయా, రాజ్, శ్రీహాన్, శ్రీ సత్య, రోహిత్, మెరీనా నామినేట్ కావడం జరిగింది. 

కాగా నామినేషన్స్ ఉన్నవారిలో ఒకరు ఇమ్యూనిటీతో బయటపడే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు. దీని కోసం ఇంటి సభ్యులు తమకు ఇచ్చిన చెక్స్ పై అమౌంట్ రాయాలి. వారు రాసిన అమౌంట్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ నుండి తగ్గించబడుతుంది. తొమ్మిది మందిలో ఎక్కువ అమౌంట్ రాసిన ఇంటి సభ్యుడికి ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే నామినేషన్ నుండి బయటపడతారు. ఇంటి సభ్యులతో బిగ్ బాస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. నేను ఎటూ గెలిచేది లేదని నమ్మినవాళ్లు ఎక్కువ అమౌంట్ రాసి సేవ్ కావాలని చూస్తారు. విన్నర్ నేనే టైటిల్ నాదే అనుకుంటే ఓడిపోయినా పర్లేదని తక్కువ అమౌంట్ రాస్తారు. 

ఆదిరెడ్డి, రేవంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కారణంతో వారు చాలా తక్కువ అమౌంట్ రాసినట్లు తెలుస్తుంది. ఆదిరెడ్డి అయితే ఎలిమినేషన్ నుండి తప్పుకోవడానికి ఎక్కువ అమౌంట్ రాసిన కంటెస్టెంట్ అసలు ప్లేయర్ కాదని అన్నాడు. కాగా ఈ గేమ్ నుండి శ్రీసత్యను బిగ్ బాస్ డిస్ క్వాలిఫై చేశాడు. ఇంటి సభ్యులు చెక్ పై రాసే అమౌంట్ ఇతరులకు చెప్పకూడదు, చర్చించకూడదని క్లియర్ గా చెప్పాడు. 

శ్రీసత్య రూల్ బ్రేక్ చేసి తాను చెక్ పై రాసిన అమౌంట్ లీక్ చేసింది. దీంతో బిగ్ బాస్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. ఈ గేమ్ లో పాల్గొని ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ ఆమె కోల్పోయారు. కాగా 10వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. బాల ఆదిత్య, వాసంతి ఎలిమినేట్ అయ్యారు. 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షోలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకేరోజు జాతరే
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్