
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర సీమ దిగ్బ్రాంతికి గురయ్యింది. అభిమానులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. ఈక్రమంలో ఈ కుటుంబంలో జరిగే ఓ వేడుకను చూడకుండానే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. అది తన భార్య ఇందిరా దేవితో పాటు తన చివరికోరిక అని సమాచారం.
సూపర్ స్టార్ మరణంతో అభిమానులు దుఖ సాగరంలో మునిగిపోయారు.. ఆయన డైహార్ట్ ఫ్యాన్స్ కుప్పకూలిపోతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన కృష్ణ మరణంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఈక్రమంలోనే కృష్ణకు సబంధించి ఓన్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయన తన చివరికొరిక తీరకుండానే చనిపోయినట్టు న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. త్వరలో దానికి సబంధించిన పనులు స్టార్ట్ కాబోతుండగానే ఆయన మరణించడంతో మహేష్ బాబు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోది.
కొన్ని నెలల ముందు మహేష్ బాబు వాళ్ళ ఇందిరా దేవి మరణించారు. అమ్మ ఇందిరా దేవిని కోల్పోవడంతోనే తట్టుకోలేకపోయారు మహేష్. మూడు నెలలు కాకముందే తండ్రిమరణంతో మహేష్ బాబు పరిస్థితి మరీ ధారుణంగా తయారయ్యింది. ఈక్రమంలోనే మహేష్ ను మరో ఆవేదనతొలిచివేస్తున్నట్టుతెలుస్తోంది. తల్లి ఇందిరా దేవి చివరికోరిక తీర్చలేదన్న బాధతో పాటు.. తండ్రి కృష్ణ కోరిన అదే కోరికను కూడా తీర్చలేకపోయినందకు సూపర్ స్టార్ బాధపడుతున్నారట.
ఎప్పుడు తల్లి తండ్రుల మాటలకు విలువిచ్చే మహేష్.. ఒక విషయంలో మాత్రం మహేష్ బాబు అమ్మ నాన్న మాటలకు వ్యతిరేకించాడట. తన కూతురు సితార విషయంలో తల్లి తండ్రుల కోరికను వ్యవితరేకించాడట మహేష్ బాబు. తమ మనవరాలు మహేష్ కూతురు సితార ఓణీల ఫంక్షన్ చేయాలని ఇద్దరు బాగా ఆశపడ్డారట. తల్లి బ్రతికున్నప్పుడే చాలా సార్ల ఈ కోరిక కోరిందట. కాని మహేష్ కు ఇలాంటి కార్రక్రమాలు నచ్చక..వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.
అయితే తల్లి కోరినా కూడా తాను నెరవేర్చకపోవడంతో బాధలో ఉన్న మహేష్..తండ్రికైనా ఈ కార్యక్రమం చూపించాలని అనుకున్నాడట. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడట. తల్లి చనిపోయింది రీసెంట్ గానే కనుక మరికొన్ని నెలల్లో ఓణీల ఫంక్షన్ చేద్దా అని అనుకున్నాడట మహేష్.
తల్లి ఆఖరి కోరిక కావడంతో ఆమె లేకపోయినా ఆమె కోరిక తీర్చడానికి ఫంక్షన్ చేయడానికి సిద్ధపడ్డారట మహేష్. ఈ క్రమంలోనే మనవరాలు జీవితంలో జరిగే మొదటి ముచ్చటను చూడడానికి సూపర్ స్టార్ కృష్ణ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారట. సూపర్ స్టార్ కృష్ణకు సితా పాప అంటే చాలా ఇష్టం, మహేష్ బాబు కూడా సితార అంటే తన తల్లిలాగే ఫీల్ అవుతాడట. సితార కూడా వాళ్ళ నానమ్మ పోలికలతోనే పుట్టడంతో.. మహేష్ కు కూడా సితార అంటే ప్రాణం.
ఈ క్రమంలోనే సితార ఓణీల ఫంక్షన్ చూస్తాము అని ఆశగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ మరింత బాధపడుతున్నారు . ఇటుమహేష్ కూడా వాళ్లు అడినప్పుడు చేసి ఉంటే బాగుండేది అని ఆవేదన పడుతున్నట్టు సమాచారం.