Bigg Boss Telugu 6: చెల్లి చెల్లి అంటూ వెన్నపూస్తున్నాడు... బాల ఆదిత్య క్యారెక్టర్ ని ప్రశ్నించిన శ్రీసత్య 

Published : Oct 27, 2022, 01:58 PM IST
Bigg Boss Telugu 6: చెల్లి చెల్లి అంటూ వెన్నపూస్తున్నాడు... బాల ఆదిత్య క్యారెక్టర్ ని ప్రశ్నించిన శ్రీసత్య 

సారాంశం

బాల ఆదిత్య క్యారెక్టర్ పై గీతూ, శ్రీసత్య మధ్య చర్చ నడిచింది. ప్రతిసారి ఏదో ఒకటి చేయడం, చేసే ముందు వెన్నపూస్తున్నాడంటూ అంటూ శ్రీసత్య సీరియస్ అలిగేషన్స్ చేశారు. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కొంచెం కఠినంగా ఉంది. చేపల చెరువు టాస్క్ కోసం బిగ్ బాస్ ఏర్పాటు చేసిన జంటలు పోటీపడ్డాయి. గాల్లో నుండి పడుతున్న చేపలను సేకరించడం, వాటిని దాచుకోవడానికి కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఈ క్రమంలో గొడవలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఫిజికల్ గా కూడా తోపు లాటలు జరిగాయి. గేమ్ నుండి ఫస్ట్ రౌండ్ లోనే తప్పుకున్న గీతూ-ఆదిరెడ్డిలను బిగ్ బాస్ సంచాలకులుగా నియమించాడు. ఈ క్రమంలో గీతూ కంటెస్టెంట్స్ మధ్య మరింత చిచ్చుపెట్టింది. 

అయితే ఇంట్లో రేలంగి మామయ్యగా పేరుగాంచిన బాల ఆదిత్యపై గీతూ, శ్రీసత్య సీరియస్ ఆరోపణలు చేశాడు. చెల్లి చెల్లి అంటున్నాడు, చెల్లి అంటే ఆడ కూడదా, అని శ్రీసత్యతో చెప్పింది. ఇక శ్రీసత్య మాట్లాడుతూ... ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ, వెన్నపూస్తున్నావంటే  నీ రియల్ క్యారెక్టర్ ఏమిటని? ఆమె సీరియస్ అయ్యారు. తమను చెల్లి అని పిలుస్తూ, మంచిగా నటిస్తూ చేయాల్సినవి చేస్తున్నాడు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. గేమ్ లో దెబ్బతీస్తున్నాడు అనే అర్థంలో గీతూ, శ్రీసత్య మాట్లాడుకున్నారు. 

ఇక బ్లాక్ ఫిష్ గీతూకి దొరకడంతో ఆమెకు బిగ్ బాస్ ప్రత్యేక పవర్ ఇచ్చాడు. తన పవర్ ఉపయోగించి గీతూ రేవంత్ గేమ్ ని డిస్ట్రబ్ చేసింది. దీనికి రేవంత్ ఆగ్రహానికి గురయ్యారు. లోపల లావా పొంగుతుందని చెప్పాడు. అలాగే గీతూ గురించి రోహిత్-రాజ్ మధ్య డిస్కషన్ నడిచింది. మమ్మల్ని రెచ్చగొట్టింది రోహిత్ ఆరోపించగా, ఆమె చేసినవన్నీ చేసి ఫైనల్ గా ఏడుస్తుంది అంటూ ఆరోపించాడు. 

కాగా ఈ వారం ఎవరు హౌస్ వీడతారనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ వారం హౌస్లో ఉన్న 14 మంది నామినేట్ అయ్యారు. దీంతో అందరు కంటెస్టెంట్స్ పై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుంది. ఏడవ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేటైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహిరావు, చలాకి చంటి, సుదీప, అర్జున్ కళ్యాణ్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్