Bigg boss telugu5: హౌస్ నుండి లోబో అవుట్..!

Published : Oct 31, 2021, 11:23 PM IST
Bigg boss telugu5: హౌస్ నుండి లోబో అవుట్..!

సారాంశం

ఎంటర్టైన్మెంట్ మధ్య కూడా ఎలిమినేషన్స్ అనేవి ఒకింత ఉత్కంఠ రేపాయి. అయితే ఇప్పటిలాగే ఊహించిన కంటెస్టెంట్స్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.   

Bigg boss telugu 5 దీపావళి ఎపిసోడ్ ధూమ్ ధామ్ గా జరిగింది. స్పెషల్ గెస్ట్స్ తో పాటు ఫన్నీ గేమ్స్ తో ఆహ్లాదకరంగా సాగింది. దేవరకొండ బ్రదర్స్, అవికా గోర్, సింగర్ కల్పన,హీరోయిన్ శ్రీయా, డైరెక్టర్ మారుతీ , హీరోయిన్ మెహ్రీన్, ముక్కు అవినాష్, బాబా భాస్కర్... ఒకరా ఇద్దరా లెక్కకు మించిన గెస్ట్స్ వచ్చారు. గంటల తరబడి సాగిన ఎపిసోడ్ లో గెస్ట్స్ కూడా ప్రేక్షకులకు వినోదం పంచారు. 

అందరికీ మించి బిగ్ బాస్ వైఫ్ లేడీ బాస్ అంటూ యాంకర్ సుమ చేసిన అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. హౌస్ మేట్స్ లోని మైనస్ లను తెరపైకి తెచ్చి వాళ్ళతో ఓ ఆట ఆడుకుంది. కంటెస్టెంట్స్ పై Anchor suma పంచ్ లు బాగానే పేలాయి. ఇంత ఎంటర్టైన్మెంట్ మధ్య కూడా ఎలిమినేషన్స్ అనేవి ఒకింత ఉత్కంఠ రేపాయి. అయితే ఇప్పటిలాగే ఊహించిన కంటెస్టెంట్స్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. 

 ఎలిమినేషన్స్ లో ఉన్న నలుగురిలో ఒకరిని విజయ్ దేవరకొండ సేవ్ చేస్తారని నాగార్జున చెప్పారు. ఒక బాంబుని పోలిన టాయ్ ని స్టేజ్ పైకి తెచ్చిన నాగార్జున, తాను పేరు చెబుతున్నప్పుడు ఒక్కో వైర్ కట్ చేయాలని, వైర్ కట్ చేసినప్పుడు బాంబు పేలిన సౌండ్ వచ్చినవారు సేవ్ కానట్లు, పేలిన సౌండ్ రాకపోతే సేవ్ అయినట్లు చెప్పారు. మొదట లోబో పేరు చెప్పగా Vijay devarakonda వైర్ కట్ చేశారు. బాంబు పేలిన సౌండ్ రావడం జరిగింది. దానితో లోబో సేవ్ కాలేదు. రెండో వైర్ శ్రీరామ్ కోసం కట్ చేయగా మరలా సౌండ్ వచ్చింది. అలా లోబో, శ్రీరామ్ సేవ్ కాలేదు. 

Also read హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్
తన హ్యాండ్ బాగోలేదని విజయ్ దేవరకొండ కట్టర్ ఆనంద్ కి ఇచ్చారు. సిరి పేరు చెప్పగా, ఆనంద్ వైర్ కట్ చేశారు. సౌండ్ రాకపోవడంతో సిరి సేవ్ అయ్యారు. తనను Anand devarakonda సేవ్ చేశాడన్న ఆనందంలో సిరి... '' ఐ లవ్ యూ ఆనంద్' అంటూ పలుమార్లు చెప్పింది. ఆమెకు ఆనంద్ దేవరకొండ సైతం ఐ లవ్ యూ చెప్పడం జరిగింది. 

Also read Bigg boss telugu5: సిరికి ఐ లవ్ యూ చెప్పిన దేవరకొండ బ్రదర్... ఉబ్బితబ్బి అవుతున్న బేబీ!

ఇక రవి సైతం సేవ్ కాలేదు. అప్పటి వరకు ముగ్గురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. అనంతరం స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ అవికా గోర్ రవి, Lobo, శ్రీరామ్ నుండి శ్రీరామ్ సేవ్ అయినట్లు చెప్పారు.అవికా గోర్ ప్రత్యేకంగా షన్ను గేమ్ గురించి మాట్లాడం ప్రత్యేకత సంతరించుకుంది.  ఇక ఎలిమినేషన్స్ లో రవి, లోబో మిగిలారు. 

ఎపిసోడ్ చివర్లో రెండు చిచ్చు బుడ్లు తీసుకొచ్చిన నాగార్జున ఒకదానిపై లోబో, మరొకదానిపై Ravi పేరు రాశారు. నేను ఈ రెండు చిచ్చుబుడ్లను వెలిగిస్తాను, ఎవరి చిచ్చుబుడ్డి అయితే వెలుగుతుందో వారు సేఫ్, మరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. నాగార్జున రెండు చిచ్చుబుడ్లను మార్చి మార్చి వెలిగించడం జరిగింది. చివరకు రవి పేరు రాసి ఉన్న చిచ్చుబుడ్డి వెలిగింది. దీనితో రవి సేవ్ అయ్యాడు. లోబో ఎలిమినేట్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చిన లోబో తన మిత్రులకు గుడ్ లుక్ చెప్పి, అక్కడ వేదిక నుండి నిష్క్రమించాడు. 
 

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు క్రేజీ కామెడీ సినిమా.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్‌ ఇవే