బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్

pratap reddy   | Asianet News
Published : Oct 16, 2021, 04:26 PM IST
బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్

సారాంశం

నందమూరి నటసింహం బాలకృష్ణ, అందాల తార రోజా కాంబినేషన్ అంటే వెంటనే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడి. 

నందమూరి నటసింహం బాలకృష్ణ, అందాల తార రోజా కాంబినేషన్ అంటే వెంటనే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడి. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాక బాలయ్యతో రోజా పెద్దన్నయ్య,మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది. 

అందుకే రోజా, బాలయ్య మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. రాజీకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రోజాకు బాలయ్య అంటే అభిమానం. Balakrishna కూడా రోజాని ఏ కార్యక్రమంలో కలిసినా ఆప్యాయంగా పలకరిస్తారు. 

ప్రస్తుతం Roja జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మనో, రోజా ఇద్దరూ జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. తాజాగా Jabardasth ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఓ ఆసక్తికర సంఘటన చూపించారు. మా అందరి ముందు బాలకృష్ణ గారికి ఫోన్ చేయండి అని అనసూయ రోజాని రిక్వస్ట్ చేస్తుంది. 

దీనికి రోజా బదులిస్తూ.. ఆయన మంచి మూడ్ లో ఉంటే ఓకే.. లేకపోతే అనుకుంటూ బాలయ్యకు ఫోన్ కలుపుతుంది. బాలయ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఆ రోజా గారు నమస్కారం.. నేను బావున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతారు. బానున్నాను సర్.. జబర్దస్త్ షూటింగ్ లో ఉన్నా..మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది రోజా.. నేను మన అఖండ షూటింగ్ లో ఉన్నా అని బాలయ్య అంటాడు. మళ్ళీ మనిద్దరం కలసి ఎప్పుడు నటిద్దాం.. Bhairava Dweepam పార్ట్ 2 లోనా, బొబ్బిలి సింహం పార్ట్ 2 లోనా అని అడుగుతుంది. బాలయ్య నవ్వుతూ..మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు అని అంటాడు. జబర్దస్త్ షోకి నేను కూడా జడ్జిగా వస్తాను.. నాకేం అభ్యంతరం లేదు అని అనడంతో జబర్దస్త్ లో ఉన్నవారంతా కేరింతలు పెడతారు. 

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో Akhanda చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. అలాగే బాలయ్య 'ఆహా' ఓటిటిలో 'అన్ స్టాపబుల్' అనే షో కూడా చేస్తున్నారు. 

Also Read: తొలిసారి క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన దీప్తి సునైనా.. లంగాఓణిలో నాభి అందాలు అదుర్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌