Bigg boss telugu 5 : ఆ కంటెస్టెంట్ ని మోసేస్తున్న మెగా ఫ్యాన్స్, విన్నర్ అవుతాడా?

Published : Nov 25, 2021, 09:49 AM IST
Bigg boss telugu 5 : ఆ కంటెస్టెంట్ ని మోసేస్తున్న మెగా ఫ్యాన్స్, విన్నర్ అవుతాడా?

సారాంశం

లేటెస్ట్ సీజన్లో (Bigg boss telugu 5) కూడా కంటెస్టెంట్స్ కి బయట అభిమాన సంఘాలు, ఆర్మీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్, యాంకర్ రవిల కోసం వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా వెళ్లిన కంటెస్టెంట్స్ తమ ఆట తీరుతో ఫ్యాన్స్ ని సంపాదించుకుంటారు. షోని ప్రతీరోజూ ఫాలో అయ్యే ప్రేక్షకులు కంటెస్టెంట్స్ పై అభిమానం పెంచుకుంటారు. దాని ఫలితమే బయట ఆర్మీలు తయారవుతాయి. బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ అందుకున్న కౌశల్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. కౌశల్ ఆర్మీ అంటూ తన కోసం విపరీతంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan kalyan)ఫ్యాన్స్ కౌశల్ ఆర్మీగా ఏర్పడి, అతన్ని గెలిపించారన్న టాక్ ఉంది. 


లేటెస్ట్ సీజన్లో (Bigg boss telugu 5) కూడా కంటెస్టెంట్స్ కి బయట అభిమాన సంఘాలు, ఆర్మీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్, యాంకర్ రవిల కోసం వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్స్ పై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే, సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న మానస్ కి మెగా ఫ్యాన్స్ సప్పోర్ట్ లభిస్తుంది. మానన్ గతంలో చిరంజీవి (Chiranjeevi) తో దిగిన ఫోటో  షేర్ చేస్తున్న ఆయన అభిమానులు, తమకు మెగా  ఫ్యామిలీ అండ ఉందని పరోక్షంగా తెలియజేస్తున్నారు. 

Also read Bigg Boss Telugu5: తీవ్ర వేదనతో చెంపలు వాయించుకున్న పింకీ.. హౌస్ లో కమ్యూనిటీ గొడవ
అనేక సమీకరణాల అనంతరం మానస్ ని సప్పోర్ట్ చేయాలని మెగా ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారట. గత సీజన్స్ ట్రాక్ రికార్డు చూస్తే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన శివ బాలాజీ, కౌశల్ టైటిల్ విన్నర్స్ గా నిలిచారు. కాబట్టి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న మెగా అభిమానుల సప్పోర్ట్ అందుకున్న మానస్ టైటిల్ గెలిచే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. మొదటి రెండు వారాలు చాలా కామ్ గా ఉన్న మానస్, మెల్లగా తన గేమ్ బయటికి తీశారు. 
లేటెస్ట్ సర్వేల ప్రకారం మానస్ టాప్ ఫైవ్ లో ఒకరిగా ఉన్నారు. అతడు టైటిల్ రేసులోకి రావాలంటే షణ్ముఖ్, రవి, సన్నీలను అధిగమించాల్సి ఉంటుంది. మరో నెల రోజుల్లో షో ముగియనుండగా, మానస్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో చూడాలి మరి. 

Also read Priya:నైటీలో బిగ్ బాస్ ప్రియ బెడ్ రూమ్ వీడియో నెట్టింట హల్చల్..బోల్డ్ కామెంట్స్ తో నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే