Bigg boss telugu 5: ఆ కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి!

Published : Nov 19, 2021, 12:35 PM IST
Bigg boss telugu 5: ఆ కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. నాలుగు వారాల్లో షో ముగియనుంది. దీనితో హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కాగా బిగ్ బాస్ ఓ కంటెస్టెంట్ కి నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం కల్పించారు.   

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5) లో మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. 9తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో 10వ కంటెస్టెంట్ జెస్సీ హౌస్ ని వీడడం జరిగింది. ఇక మిగిలిన 9మంది కంటెస్టెంట్స్ నుండి ఐదుగురు ఫైనల్ కి నలుగురు ఎలిమినేటై హౌస్ నుండి బయటికి రానున్నారు. ఫైనల్ సమీపిస్తున్న నేపథ్యంలో హౌస్ లో టాస్క్ లు కూడా రసవత్తరంగా మారాయి. 


కాగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నుండి ఒకరు నేరుగా ఫైనల్ కి చేరే ఎవిక్షన్ పాస్ ని బిగ్ బాస్ ఆఫర్ చేశాడు. దీని కోసం ఆయన ఓ గేమ్ నిర్వహిచడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఉన్న ఫైర్ ఇంజిన్ లో రెండు సీట్లు ఉంటాయి. అలారం మోగిన వెంటనే ఎవరైతే ముందుగా వెళ్లి ఆ సీట్స్ లో వెళ్లి కూర్చుంటారో... వారి ఎదురుగా కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. ఫైర్ ఇంజిన్ లో కూర్చున్న ఇద్దరికి ఆ ఫొటోలను కాల్చే హక్కు ఉంటుంది. వాళ్ళను కన్విన్స్ చేసుకొని, తమ ఫోటో కాల్చకూడా సేవ్ చేసుకోవచ్చు. 

Also read Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర
ఈ టాస్క్ లో ఎవరి ఫోటో అయితే కాల్చబడకుండా చివరి వరకూ ఉంటుందో.. వాళ్లకు ఎవిక్షన్ పాస్ దక్కుతుంది. దాని ద్వారా ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యి,  ఫైనల్ కి చేరుకుంటారు. మరి ఎవిక్షన్ పాస్ పొంది.. ఎలిమినేషన్ నుండి బయటపడి ఫైనల్ కి ఎవరు వెళతారో చూడాలి. ఇక ఈ వారాం కెప్టెన్ రవి మినహాయించి... ఎనిమిది మంది నామినేట్ కావడం జరిగింది. వీరిలో కాజల్, లేదా యాని మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని తెలుస్తుంది. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో వీరిద్దరికే తక్కువ ఓట్లు వచ్చాయని, అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే