Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. తన సైన్యంతో అల్లు అర్జున్ చిందులు

pratap reddy   | Asianet News
Published : Nov 19, 2021, 12:23 PM IST
Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. తన సైన్యంతో అల్లు అర్జున్ చిందులు

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'Pushpa' చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'Pushpa' చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్ కావడంతో.. పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. 

దీనితో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రంలో ఒక్కో పాటని విడుదల చేస్తూ అభిమానులని అలరిస్తున్నారు. Devisri Prasad స్వరాలు అందిస్తున్న ఈ చిత్ర పాటలకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ సాగే నాల్గవ పాట విడుదలయింది. 

బహుశా Allu Arjun ఈ చిత్రంలో స్మగ్లింగ్ డాన్ గా ఎదిగాక తన సైన్యంతో కలసి సెలబ్రేట్ చేసుకునే నేపథ్యం అయి ఉండొచ్చు. 'ఈ పక్కా నాదే.. ఆ పక్కా నాదే.. పైనున్న ఆకాశం ముక్కా నాదే, నిను మట్టిలో పాతేస్తా.. ఖరీదైన ఖనిజంలా మళ్ళీ వస్తా అంటూ చంద్రబోస్ మంచి లిరిక్స్ అందించారు. 

Also Read: Bheemla Nayak: 'భీమ్లా నాయక్' బ్యూటీ సంయుక్త మీనన్ మతిపోగోట్టే ఫోజులు.. డబుల్ డోస్ హాట్ నెస్

సాంగ్ ట్యూన్ క్యాచీగా ఉంది. లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని డాన్ లాగా కనిపిస్తున్నాడు. తన సైన్యంతో చిందులేస్తూ ఊర నాటు యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు. జాతర వాతావరణాన్ని తలపించేలా ఈ సాంగ్ లో బ్యాగ్రౌండ్, కొరియోగ్రఫీ ఉంది. అల్లు అర్జున్ జబ్బలు చరుస్తూ ఇది నా అడ్డా అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మొత్తగా ఈ సాంగ్ పుష్ప చిత్రంలో మరో హిట్ సాంగ్ గా నిలిచిపోనుంది. 

బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే