షాకింగ్: తగ్గేదే లే, తేల్చి చేప్పేసిన భీమ్లా నాయక్ నిర్మాత.. బరిలో పాన్ ఇండియా చిత్రాలు ఉన్నా..

By team teluguFirst Published Oct 25, 2021, 11:20 PM IST
Highlights

ఒక వైపు పవన్, మరోవైపు రానా స్టార్ పవర్ తో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలని ధీటుగా ఎదుర్కొనవచ్చనే కాన్ఫిడెన్స్ భీమ్లా నాయక్ నిర్మాతల్లో కనిపిస్తోంది. 

RRR చిత్రం సంక్రాంతి బరిలో నిలవడంతో అంతా గందరగోళంగా మారింది. అంతకు ముందే సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకుని కూర్చున్న చిత్రాల పరిస్థితి ఏమిటి అంటూ అటు టాలీవుడ్, ఇటు అభిమానుల్లో చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు ఆ మధ్యన ప్రకటించారు. 

ఇక మహేష్ సర్కారు వారి పాట జనవరి 13న.. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ జనవరి 14న రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నాం అంటూ జక్కన్న ప్రకటించడంతో ఆల్రెడీ బరిలో ఉన్న చిత్రాలకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఓ వైపు ప్రభాస్.. మరోవైపు రాజమౌళి రెండు పాన్ ఇండియా చిత్రాలతో రాబోతుండడంతో.. Pawan Kalyan, మహేష్ బాబు చిత్రాలు పక్కకు తప్పుకోక తప్పదనే ఉహాగానాలు వినిపించాయి. 

ఆ చిత్రాల రిలీజ్ డేట్లు మారిపోతున్నాని అని కూడా ప్రచారం జరిగింది. కానీ భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కొద్దీ సేపటి క్రితమే ఊహించని షాక్ ఇచ్చారు. భీమ్లా నాయక్ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 1న థియేటర్స్ లో రిలీజ్ కావడం పక్కా అంటూ సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రకటించారు. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారిపోతోంది అని ప్రచారం జరుగుతున్న సమయంలో నవ వంశీ ఈ ప్రకటన చేయడం టాలీవుడ్ లో ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

the BIG SCREEN will be lit on 12th January 2022 with the intensity of the ULTIMATE CLASH of & 🔥 pic.twitter.com/YFT4j73zLo

— Naga Vamsi (@vamsi84)

ఒక వైపు పవన్, మరోవైపు రానా స్టార్ పవర్ తో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలని ధీటుగా ఎదుర్కొనవచ్చనే కాన్ఫిడెన్స్ భీమ్లా నాయక్ నిర్మాతల్లో కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఢీ అంటే ఢీ అనే శైలి పవన్ ది. సో ఈ విషయంలో పవన్ కూడా నిర్మాతని బాగా ఎంకరేజ్ చేసి ఉండవచ్చు. 

సో తెలుగు ప్రేక్షకులంతా ఈ సంక్రాంతికి కనీవినీ ఎరుగని బాక్సాఫీస్ సమరాన్ని వీక్షించబోతున్నారు. మలయాళంలో ఘనవిజయం అందుకున్న అయ్యప్పన్ కోషియం చిత్రానికి భీమ్లా నాయక్ రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అదరగొడుతున్నాయి. పవన్ అభిమానులు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ హ్యాంగోవర్ లో మునిగితేలుతున్నారు.

click me!