బిగ్‌ బాస్‌ సన్నీ `సౌండ్‌ పార్టీ`.. థియేటర్లలో సౌండ్‌ పగిలిపోతుందట..

Published : Jun 28, 2023, 09:35 PM IST
బిగ్‌ బాస్‌ సన్నీ `సౌండ్‌ పార్టీ`.. థియేటర్లలో సౌండ్‌ పగిలిపోతుందట..

సారాంశం

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన వీజే సన్నీ   కొత్త సినిమాతో రాబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో ఆయన థియేటర్లలో గట్టిగా సౌండ్‌ చేయబోతున్నారట. 

`బిగ్‌ బాస్‌` షో ద్వారా సంచలనంగా మారాడు వీజే సన్నీ. `బిగ్‌ బాస్‌ 5`లో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో టైటిల్‌ విన్నర్‌గా నిలిచాడు. పాపులర్‌ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ని కేవలం రన్నరప్‌గా నిలిపాడు. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ కావడంతో సన్నీకి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల `అన్‌స్టాపబుల్‌` అంటూ రచ్చ చేశాడు సన్నీ. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఇండస్ట్రీలో గట్టిగా సౌండ్‌ చేయబోతున్నారు. అంతేకాదు `సౌండ్‌ పార్టీ` ఇవ్వబోతున్నాడు.

వీజే సన్నీ `సౌండ్‌ పార్టీ` పేరుతో కొత్త సినిమా చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా టైటిల్‌ లోగోని లాంచ్‌ చేశారు. సినిమా జర్నలిస్ట్ ల సమక్షంలో ఈ లోగో లాంచ్‌ కావడం విశేషం. ఈ సినిమాకి దర్శకుడు జయశంకర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సంజయ్‌ శేరీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫుల్‌ మూన్‌ మీడియా పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. 

లోగో ఆవిష్కరణ సందర్భంగా హీరో వి.జె స‌న్ని మాట్లాడుతూ, `నేను పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వ‌చ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత యుఎస్ లో ఉంటూ కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా పూర్తి చేయ‌డానికి స‌హ‌క‌రించారు. మా ద‌ర్శ‌కుడు సంజ‌య్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా సినిమా తీశాడు. జ‌య‌శంక‌ర్ అన్నీ తానై సినిమాను న‌డిపించాడు. క‌చ్చితంగా `సౌండ్ పార్టీ` థియేట‌ర్ లో గ‌ట్టిగా సౌండ్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా అని అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ, `ఈ సినిమా ప్రారంభ‌మై గుమ్మ‌డి కాయ‌ కొట్ట‌డం వ‌ర‌కు వ‌చ్చిందంటే అది కేవ‌లం నా మిత్రుడు జ‌య‌శంక‌ర్ వల్లే. త‌ను లేకుంటే ఈ సినిమా లేదు. స‌న్నీ తో పాటు కాస్ట్ అండ్ క్రూ అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. ఇదొక ఫుల్ ఫ‌న్ రైడ్ చిత్రం. ఆగ‌స్ట్ లో రిలీజ్ కు ప్లాన్  చేస్తున్నాం` అని చెప్పారు. 30 ఇయ‌ర్స్ పృథ్వీ మాట్లాడుతూ, `స‌న్నీతో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఎమ్మెల్యే గా న‌టిస్తున్నా. ద‌ర్శ‌కుడు ఎంతో క్లారిటీగా చెప్పి మాతో వ‌ర్క్ చేయించుకున్నాడు. ర‌విగారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. వి.జ‌య‌శంక‌ర్ తెర‌ వెనకుండి ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య రాకుండా  సినిమాను ముందుకు న‌డిపించారు` అని చెప్పారు. 

ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత‌, నిర్మాత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ, `ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  కథా,కథనాన్ని న‌మ్మి సినిమాలు తెర‌కెక్కిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరే విభిన్నమైన, ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడమే మా లక్ష్యం.  USA లో ఆంగ్ల చలన చిత్రాలు, మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉన్నందున,  తెలుగు సినిమా వైపు ఆకర్షించబడ్డాను. అయితే, నేను కేవలం సినిమాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదు.  సినిమా నిర్మాణంలో ప్రతి అంశంలోనూ పాలుపంచుకోవాలని అనుకున్నాను. ఈ కోరికే నన్ను ప్రతిభావంతులైన చిత్రనిర్మాతల తో కనెక్ట్ అవ్వడానికి మరియు సహకరించడానికి దారితీసింది. 

ఫలితంగా అనేక షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్ ఫిల్మ్‌ల నిర్మాణం జరిగింది. ఎన్నో ప్రశంసలు పొందిన వెబ్ చిత్రం "విటమిన్ షీ" విజయవంతంగా విడుదలైన తర్వాత,  ఈసినిమాతో  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ అద్భుతమైన ప్రయాణంలో, నా ప్రియ మిత్రుడు జయశంకర్ మార్గదర్శకత్వం, స‌పోర్ట్  లభించడం నా అదృష్టం. అతని ప్లానింగ్ సినిమాకు ఎంతో ఉపయోగ‌ప‌డింది. నిబ‌ద్ద‌త క‌లిగిన టీమ్ దొర‌కడం వ‌ల‌న ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా సినిమా పూర్తి చేయ‌గ‌లిగాం. మా సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం అంటే మా చిత్ర‌ బృందం యొక్క అంకితభావం , వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి ఆగ‌స్ట్ లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తాం` అని చెప్పారు. 

శివ‌న్నారాయ‌ణ , అలీ, సప్తగిరి, థర్టీఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరికిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్` ’ అంజలి, ఇంటూరివాసు, చలాకిచంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణతేజ త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ;  పాట‌లు : పూర్ణచారి;  పి. ఆర్. ఓ. :  జికె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు ; నిర్మాత : రవి పోలిశెట్టి; సమర్పణ : వి.జయశంకర్ ; రచన - దర్శకత్వం : సంజయ్ శేరి.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం