నా జోలికొస్తే మీకు దూల తీర్చేస్తా.. రాజకీయాలపై శివాజీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published : Jan 19, 2024, 09:43 PM IST
నా జోలికొస్తే మీకు దూల తీర్చేస్తా.. రాజకీయాలపై శివాజీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

సారాంశం

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శివాజీ.. రాజకీయాలపై స్పందించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని ఒకవేళ అంటగడితే మాత్రం దూల తీర్చేస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. 

శివాజీ.. అలియాస్‌ బిగ్‌ బాస్‌ శివన్న.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈయన పేరే వైరల్‌ అవుతుంది. ఆయన చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల బాగా సోషల్‌ మీడియాలో, మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు శివాజీ. బిగ్‌ బాస్‌ షోతో ఆయనకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఆయన చేస్తున్న కామెంట్స్ అన్నింట రచ్చ చేస్తున్నాయి. దీంతో శివాజీ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఆయన దీనిపై స్పందించారు. రాజకీయాల్లోకి వెళ్తారా? సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నకి శివాజీ స్పందించారు. 

శివాజీ మాట్లాడుతూ, తాను సమైఖ్యవాదిని కాదని, తాను ప్రత్యేకవాదానికి కట్టుబడి ఉన్నానని, ఆ ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుకున్నాని, తెలంగాణకు తన మద్దతు ఉంటుందని, ఎందుకంటే యాభై ఏళ్లు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అని చెప్పారు. ఈ సందర్భంగా తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. తను నిజాలు మాట్లాడతానని, అది రాజకీయాల్లో పనికి రాదన్నారు. అందుకే తాను రాజకీయాలకు పనికి రాను అని తెలిపారు. అయితే ప్రజల గొంతుకుగా ఉంటాను, ప్రజల సమస్యలపై మాట్లాడతానని తెలిపారు. తనకు చంద్రబాబుకో, జగన్‌కో, కేసీఆర్‌తోనే సంబంధం లేదన్నారు.

అయితే రాజకీయాల్లోకి వెళ్తారా అంటే.. తన పిల్లల కోరిక తాను సినిమాలు చేయడం, తనని సినిమాల్లో చూడటం. ఆ దిశగానే వెళ్తున్నానని, రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం లేదని తెలిపారు. అయితే తనని రాజకీయాల్లోకి లాగితే మాత్రం ఊరుకోబోనని, కావాలని ఒక పార్టీకి అంటగడితే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్లి మీ దూల తీర్చేస్తా అని తెలిపారు శివాజీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనని, తనని అందులోకి లాగొద్దని తెలిపారు. నా జోలికి రావద్దని, సినిమాలపైనే ప్రస్తుతం తన దృష్టి ఉన్నట్టు చెప్పాడు శివాజీ. 

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో పూర్తయిన తర్వాత ఆయన `90 మిడిల్‌ క్లాస్‌` అనే వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇది విశేష ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో శివాజీ వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడారు. అందరికి కనెక్ట్ అయ్యే సిరీస్‌ అని, అందుకే ఇంతటి ఆదరణ లభించిందన్నారు. ఇదిలా ఉంటే శివాజీ రీఎంట్రీ ఫిల్మ్ కూడా కన్ఫమ్‌ అయ్యింది. ఇటీవలే ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. `కూర్మ నాయకి` అనే హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీతో రాబోతున్నారు. ఇందులో తనది చాలాశక్తివంతమైన పాత్ర అని, అది ఎలా ఉంటుంది, తన పాత్ర ఏంటనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం