అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడా? క్లారిటీ ఇచ్చిన టీమ్!

By Sambi Reddy  |  First Published Jan 19, 2024, 6:57 PM IST

అయోధ్య లో రామ భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అన్నదానానికి అయ్యే ఖర్చు హీరో ప్రభాస్ భరించారని, రూ. 50 కోట్లు దానం చేశాడంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. 
 


అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. జనవరి 22న ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో రామ భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అన్నదానానికి అయ్యే ఖర్చు హీరో ప్రభాస్ భరించారని, రూ. 50 కోట్లు దానం చేశాడంటూ వార్తలు వెలువడ్డాయి. 

ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించారు. అదంతా అబద్దపు ప్రచారమే అని తేల్చారు. ప్రభాస్ అయోధ్య రామ మందిర అన్నదాన కార్యక్రమం కోసం కోట్ల రూపాయలు దానం చేశాడనడంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. దీంతో స్పష్టత వచ్చింది. ఇక 22న అయోధ్యలో జరిగే వేడుకకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. టాలీవుడ్ నుండి ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ఆహ్వానం దక్కింది. 

Latest Videos

మరోవైపు ప్రభాస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక రోల్స్ చేస్తున్నారు. మే 9న కల్కి విడుదల కానుంది. ఇక రాజా సాబ్ చిత్రానికి మారుతి దర్శకుడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ ఉంది. 
 

click me!