Bigg Boss 6 telugu: పండగపూట రేవంత్ కాంపురంలో మరోసారి చిచ్చు పెట్టిన నాగార్జున

Published : Oct 23, 2022, 07:19 PM IST
Bigg Boss 6 telugu: పండగపూట రేవంత్ కాంపురంలో మరోసారి చిచ్చు పెట్టిన నాగార్జున

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్  7 వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈరోజు ఆదివారం దివాళి ఎపిసోడ్ తో ముందు రోజే పండగ తీసుకువచ్చారు మేకర్స్ సెలబ్రిటీల సందడితో బిగ్ బాస్ వేదిక కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఈ సందర్భంగా రేవంత్ అతని భార్య మధ్య మరో చిచ్చు పెట్టాడు. 

బిగ్ బస్ తెలుగు సీజన్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొదట్లో చాలా చప్పగా అనిపించినా... 5 వారం నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గా తయారయింది బిగ్ బాస్. ఇక ఈ వీకెండ్ .. ఆదివారం దిపావళి సంబరాలతో బిగ్ బాస్ వేదిక కలర్ ఫుల్ గా తయారయ్యింది. రేపు దివాళి కాగా..ముందు రోజే సంబరాలు స్టార్ట్ చేశారు  బిగ్ బాస్ టీమ్. ఈ సందర్భంగా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే ఓ కొత్త రకం గేమ్ ఆడించిన నాగార్జున.. ఇద్దరు కంటెస్టెంట్స్ ను సేవ్ చేశాడు. ఈ సందర్భంగా సేవ్ అయిన రేవంత్ పై పంచ్ పేలింది. 

నామినేషన్ లో ఉన్న వారంత ఓ టేమ్ రికార్డర్ బటన్ నొక్కగా.. అందులో సేవ్ అయిన వారుముందు వాయిస్ విని పిస్తుంది.అందులో వరుసగా బటన్ నొక్కుతుండగా..రేవంత్ వంతు వచ్చే వరకూ బటన్ నొక్కగానే తన భార్య వాయిస్ వినిపించింది. రేవంత్ సేవ్ అయినట్టు అందులో వాయిస్ వినిపించింది. అయితే తాను సేవ్ అయ్యాన్న సంతోషంలో రేవంత ఆ వాయిస్ ఎవరిది అని పట్టించుకోలేదు హౌస్ లో ఎవరో ఒకరు.. ఆ వాయిస్ నీ వైఫ్ ది కదా అని అనగా.. అప్పుడు బల్ప్ వెలిగిన రేవంత్.. అవును.. అవును అంటూ తన భార్య వాయిస్ వినిపించినందుకు థ్యాంక్స్ చెప్పాడు. 

ఇక ఇదే అదనుగా  తీసుకున్న నాగ్ రేవంత్ తో ఓ ఆట ఆడుకున్నాడు. నీ భార్య వాయిస్ కూడా మర్చిపోయావా... హౌస్ లోకి వచ్చిన ఆరు వారాల్లో ఇలా భార్యను మర్చిపోతే ఎట్లా అంటూ రేవంత్ ను ఆడేసుకున్నాడు. అంతే కాదు.. బిగ్ బాస్ ఫస్ట్ డే నీ వైఫ్ కళ్ళు కూడా గుర్తు పట్టలేకపోయావంటూ  గుర్తు చేశాడు నాగ్. దాంతో రేంత్ సార్ మళ్ళీ నా భార్య ముందు బుక్ చేయకండి సార్ అంటూ బ్రతిమలాడుకున్నాడు. ఫస్ట్ కళ్లు గుర్తు పట్టలేకపోయావ్.. ఇప్పుడు వాయిస్ గుర్తు పట్ట లేకపోయావ్ అంటూ రేవంత్ ను ఓ ఆట ఆడుకున్నాడు నాగ్. 

ఇక హౌస్ లో ఎవరు ఏంటీ.. అనే ఆట ఆడించాడు నాగర్జున. కొన్ని కార్డ్ లు అక్కడ పెట్టి.. ఎవరు ఏంటీ అని భావిస్తున్నారో ఆ కార్డ్ వారి మెడలో వేయండంటూ ఆప్షన్స్  కూడా ఇచ్చాడు. ఇక అందులో ఎక్కువ కార్డ్ లు గీతు, రేవంత్ మెడలో పడ్డాయి. బుద్ది మార్చుకో, బద్దకం లాంటి కార్డ్ లు గీతుకి. చల్లబడాలి, కోపం తగ్గించుకోవాలి, డెస్ట్ బిన్ లాంటి కార్డ్ రేవంత్ మెడలో.. ట్యూబ్ లైట్ కార్డ్ రాజ్ మెడలో పడగా.. ఇనయా టూత్ పిక్ కార్డ్ వచ్చింది. ఇక ఫస్ట్ లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ను సేవ్ చేశారు నాగ్. అందులో ముందు రేవంత్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వగా.. సెకండ్ శ్రీహాన్ సేవ్ అయ్యాడు. శ్రీహాన్ కోసం సిరి వాయిస్ తో  సేవ్ అయినట్టు చెప్పించాడు బిగ్ బాస్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ